దేశ వ్యాప్తంగా ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేలా మోడీ ప్రభుత్వం ఆలోచన చేసింది. ఇందులో భాగంగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది.
పీఎఫ్ చందాదారులకు ఈపీఎఫ్వో షాకింగ్ న్యూస్ చెప్పింది. కోవిడ్ సమయంలో కేంద్రం తీసుకొచ్చిన కోవిడ్ అడ్వాన్స్ సదుపాయాన్ని నిలిపివేసింది. ఓ వైపు లాక్డౌన్.. ఇంకో వైపు అన్ని ధరలు అమాంతంగా పెరిగిపోవడం... మరోవైపు ఉద్యోగాలు లేని పరిస్థితి.. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు తమ వైద్య, ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఈపీఎఫ్వో అడ్వాన్స్ సదుపాయాన్ని తీసుకొచ్చింది.
లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు హైకోర్టులో ఊరట లభించింది. పోక్సో కేసుకు సంబంధించి తదుపరి విచారణ జరిగే జూన్ 17 వరకు ఆయనను అరెస్టు చేయకూడదని ఆదేశించింది.
జీ7 సదస్సు కోసం ఇటలీ వెళ్లిన ప్రధాని మోడీ.. శుక్రవారం బిజిబిజీగా గడిపారు. పలు దేశాల అధినేతలతో సమావేశం అయ్యారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.
ఇటలీలో జరుగుతున్న జీ 7 సమ్మిట్ ఆద్యంతం సందడి.. సందడిగా సాగుతోంది. అగ్ర నేతలంతా ఇటలీలో ప్రత్యక్షమయ్యారు. దీంతో ఒకరినొకరు పలకరించుకుంటూ ఉత్సాహంగా సాగుతున్నారు. ఇక ప్రధాని మోడీ.. ఆయా దేశాధినేతలతో సమావేశం అయ్యారు.
తీహార్ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మెడికల్ పరీక్షల కోసం ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వైద్య పరీక్షల సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తనతో చేరేందుకు తన భార్యను అనుమతించాల్సిందిగా అభ్యర్థించారు.
నీట్ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఆయా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు, నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు.
కువైట్ అగ్నిప్రమాదంలో 50 మంది విదేశీ కార్మికులను బలి తీసుకున్న కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులతు అరెస్ట్ చేశారు. గత బుధవారం జరిగిన ప్రమాదంలో 50 మంది భారతీయులు, ఫిలిప్పీన్స్ ప్రాణాలు కోల్పోయారు.