TGTET 2026: తెలంగాణ రాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET) జనవరి -2026 పరీక్షల షెడ్యూల్‌ను సంబంధిత అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షలు జనవరి 3 నుంచి జనవరి 20 వరకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మొత్తం 9 రోజుల్లో 15 సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండటంతో ప్రతి రోజూ రెండు సెషన్ల చొప్పున పరీక్షలు నిర్వహించనున్నారు.
Shocking Incident: దారుణం.. చిన్నారిని థర్డ్ ఫ్లోర్ నుంచి కింద పడేసిన కన్న తల్లి
సెషన్–I పరీక్ష ఉదయం 9.00 గంటల నుంచి 11.30 గంటల వరకు కొనసాగుతుంది. సెషన్–II పరీక్ష మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షలకు అభ్యర్థులు ముందుగానే హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుని, పరీక్ష కేంద్రాలకు సమయానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.
Andhra King Thaluka : ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ డేట్..?