బ్రిటీష్ యువరాణి కేట్ మిడిల్టన్ ప్రత్యక్షమైంది. చాలా రోజుల తర్వాత ఆమె పబ్లిక్‌కు దర్శనమిచ్చారు. దీంతో గత కొద్ది రోజులుగా ప్రజల్లో ఉన్న అనుమానాలకు తెరపడింది. గత జనవరి నుంచి కేట్ మిడిల్టన్ ప్రజలకు ప్రత్యక్షం కాలేదు. దీంతో ఆమెపై పలు అనుమానాలను ప్రజలు, నెటిజన్లు రేకెత్తించారు. ఆమెకు ఏదో అయింది. అందుకే కనిపించడం లేదని వార్తలు వినిపించాయి. ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు మదర్స్ డే సందర్భంగా పిల్లలతో ఉన్న యువరాణి ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది మార్ఫింగ్ ఫొటో అంటూ విమర్శలు రావడంతో రాజు కుటుంబం క్షమాపణ చెప్పింది. ఇక అనంతరం కేట్ మిడిల్టన్ కేన్సర్‌తో బాధపడుతున్నారని.. ఆమె శస్త్ర చికిత్స జరిగిందని వెల్లడించారు. మొత్తానికి ఇన్నాళ్లకు ప్రజలకు ప్రత్యక్షమైంది. శనివారం బ్రిటీష్ చక్రవర్తి కింగ్ చార్లెస్ పుట్టినరోజు సందర్భంగా కవాతు జరిగింది. ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ఆమె ప్రత్యక్షమైంది. బాల్కనీలో పిల్లలతో కనిపించింది. కవాతు జరుగుతుండగా సంగీతానికి తగినట్టుగా కేట్ మిడిల్టన్ చిన్న కుమారుడు లూయిస్ డ్యాన్స్ చేశాడు. అది చూసిన ఆమె చిరు నవ్వులు చిందుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కవాతు సందర్భంగా లూయిస్ బకింగ్‌హామ్ ప్యాలెస్ బాల్కనీలో కేట్, అతని తోబుట్టువులు ప్రిన్స్ జార్జ్, ప్రిన్సెస్ షార్లెట్‌తో కనిపించాడు. అనంతరం అతడు నృత్యంలోకి ప్రవేశించాడు. అతని అక్క అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆగకుండా డ్యాన్స్ చేశాడు. కేట్ మాత్రం కుమారుడి డ్యాన్స్ చూస్తూ ఎంజాయ్ చేసింది. అంతేకాకుండా కేట్ తన ముగ్గురు పిల్లలతో క్యారేజ్‌లో ప్రయాణిస్తూ ఉల్లాసంగా కనిపించింది. హావభావాలతో సంతోషంగా ఉన్నట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Prince Louis dances along to proceedings.#TroopingTheColour pic.twitter.com/nehvzkNQUm
— Royal Central (@RoyalCentral) June 15, 2024