దేశీయ స్టాక్ మార్కెట్ దూకుడికి బ్రేక్ పడింది. గత వారం రోజులుగా భారీ లాభాల్లో కొనసాగిన సూచీలు.. శుక్రవారం మాత్రం నష్టాల్లో ముగిసింది. ఉదయం లాభాల్లో ప్రారంభం కాగా.. ముగింపునకు వచ్చేటప్పటికీ నష్టాలను చవిచూసింది.
గత కొద్ది రోజులుగా వేడి గాలులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న హస్తిన వాసులకు శుక్రవారం ఉపశమనం లభించింది. పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అలాగే హర్యానాలోని గురుగ్రామ్‌లో కూడా భారీ వర్షం కురుస్తోంది.
బెంగళూరులోని మహారాణి క్లస్టర్ యూనివర్శిటీలో విషాదం చోటుచేసుకుంది. 19 ఏళ్ల విద్యార్థిని తన హాస్టల్ గదిలో శవమై కనిపించింది. మృతురాలు కోలారు జిల్లా శ్రీనివాసపూర్‌కు చెందిన పవన అనే విద్యార్థినిగా గుర్తించారు
కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌లోని బుధని నియోజకవర్గం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విదిషా నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా విజయం సాధించారు.
మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే వివాదంలో చిక్కుకున్నారు. పార్టీ కార్యకర్తతో కాళ్లు కడిగించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే కిరణ్ చౌదరి పార్టీకి రాజీనామా చేశారు. బుధవారం ఆమె బీజేపీలో చేరనున్నారు. భివానీ జిల్లా పరిధిలోని తోషమ్ నియోజకవర్గం నుంచి కిరణ్ చౌదరి గెలుపొందారు. ఆమె కుమార్తె శృతి చౌదరి కూడా కమలం పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
శక్తికాంత దాస్.. ఆర్బీఐ గవర్నర్. మోడీ ప్రభుత్వంలో గత రెండు పర్యాయాల నుంచి ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ కొనసాగుతున్నారు. తాజాగా మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ అంశం చర్చకు వచ్చింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి వింతగా ప్రవర్తించారు. ఇటీవల ఇటలీలో జరిగిన జీ 7 సదస్సులో ఆయన ప్రవర్తన వైరల్ అయింది. అందరూ ఒక వైపు ఉంటే.. ఆయన ఇంకోవైపు చూస్తూ ఉండిపోయారు.
భార్య ఆరోగ్యం గురించి ఆలోచించడమే అతడు చేసిన తప్పు. అర్థాంగి ఆరోగ్యంగా ఉండాలని.. జిమ్‌కు తీసుకెళ్తాడు. కానీ అదే అతని కొంపముంచింది. భర్తను సైడ్ చేసి జిమ్ ట్రైనర్‌తో స్నేహం మొదలుపెట్టింది.