కెనడా ప్రభుత్వం విధించిన నో ఫ్లై జాబితా నుంచి తమ పేర్లు తొలగించాలంటూ ఇద్దరు ఖలిస్థానీ వేర్పాటువాదులు చేసిన అభ్యర్థనను కెనడాలోని ఫెడరల్ కోర్టు ఆఫ్ అప్పీల్ తిరస్కరించింది. ఇద్దరు కెనడియన్ సిక్కులు విమానాలు ఎక్కేందుకు 2018లో నిషేధం విధించింది. అయితే ఇద్దరూ రవాణా భద్రతకు ముప్పు కలిగిస్తారని.. ఉగ్ర చర్యకు పాల్పడతారన్న సహేతుకమైన కారణాలు ఉన్నాయన్న ప్రభుత్వ వాదనతో కోర్టు ఏకీభవించి.. వారి అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి: IND vs SA : దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న టీమిండియా.. షెడ్యూల్ ఇలా..
పాకిస్థాన్ మద్దతున్న ఖలిస్థానీ ఉగ్రవాదులు పర్వాకర్ సింగ్ దులై అలియాస్ పార్రీ దులై, భగత్ సింగ్ బ్రార్ గత కొన్నేళ్ల నుంచి నో ఫ్లై జాబితాలో ఉన్నారు. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా కెనడా ప్రభుత్వం వారిని ఆ జాబితాలో చేర్చింది. ఆ నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. పార్రీ దులై .. కెనడాలోని సర్రే ప్రాంతంలో ఛానెల్ పంజాబీ, చండీగఢ్‌లో గ్లోబల్ టీవీని నిర్వహిస్తున్నారు. బ్రార్.. పాకిస్థాన్‌కు చెందిన ఖలిస్థానీ సానుభూతిపరుడు లఖ్బీర్ సింగ్ రొడె కుమారుడు.
ఇది కూడా చదవండి: SDT 18: ఇట్స్ అఫీషియల్.. సాయి ధరమ్ తేజ్ తో హనుమాన్ నిర్మాత పాన్ ఇండియా మూవీ..
ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఘటన వెనక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య దౌత్య వివాదం కొనసాగుతోంది. దీనికి ఆజ్యం పోస్తూ.. నిజ్జర్ హత్య జరిగి ఏడాదైన సందర్భంగా ఇటీవల ట్రూడో సర్కార్ తమ పార్లమెంట్‌లో నివాళులర్పించింది. ఏకంగా ఆ దేశ పార్లమెంట్‌లో ఈ సంతాప కార్యక్రమం నిర్వహించారు. ఇలాంటి పరిణామాల మధ్య పాక్ మద్దతున్న ఇద్దరు ఖలిస్థానీ సానుభూతిపరులకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు రావడం గమనార్హం.
ఇది కూడా చదవండి: Rush Movie: ఓటీటీలో దూసుకుపోతున్న రవిబాబు రష్