ప్రధాని మోడీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. రాష్ట్రపతి ఆమోదం పొందిన మూడు క్రిమినల్ చట్టాల అమలును వాయిదా వేయాలని కోరుతూ మమతా బెనర్జీ శుక్రవారం లేఖ రాశారు. సభలో ఎలాంటి చర్చ లేకుండానే వీటిని ఆమోదించారని.. చట్టాలపై మరోసారి సమీక్ష జరపాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. బ్రిటీష్ కాలం నాటి నేర న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేసేలా కొత్తగా రూపొందించిన మూడు నేర న్యాయ చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో చట్టాల అమలు వాయిదా వేయాలని కోరుతూ లేఖలో పేర్కొన్నారు. డిసెంబర్, 2023లో ఈ మూడు బిల్లులు ఆమోదించినప్పుడు లోక్‌సభ, రాజ్యసభలో 146 మంది సభ్యులను సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. నిరంకుశ పద్ధతిలో బిల్లులు ఆమోదించబడ్డాయని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: AP Assembly Speaker: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవం
ప్రస్తుతం అమల్లో ఉన్న భారతీయ శిక్షాస్మృతి-1860, నేర శిక్షాస్మృతి-1898, భారతీయ సాక్ష్యాధార చట్టం-1872 స్థానంలో.. కొత్తగా భారతీయ న్యాయ సంహిత-2023, భారతీయ నాగరిక సురక్షా సంహిత-2023, భారతీయ సాక్ష్య-2023 చట్టాలు జూలై 1 నుంచి దేశమంతా అమలవుతాయని కేంద్రం పేర్కొంది.
ఇది కూడా చదవండి: Bengaluru: ఐఏఎస్ ఆఫీసర్ రోహిణి సింధూరిపై బాలీవుడ్ సింగర్ ఫిర్యాదు