ఎన్డీఏ కూటమిపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ కూటమి ఎప్పుడైనా కూలిపోవచ్చని జోస్యం చెప్పారు. ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
బీహార్‌లో ప్రారంభోత్సవానికి ముందే ఓ బ్రిడ్జి కూలిపోయింది. బీహార్‌లోని అరారియాలో రూ.12 కోట్ల రూపాయలతో వంతెనను నిర్మించారు. అయితే వంతెన ప్రారంభోత్సవానికి ముందే కుప్పకూలిపోయింది.
దేశ వ్యాప్తంగా పలు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మెయిల్స్ ద్వారా బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పోలీసులు విమానాశ్రాయాల దగ్గర పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రతీ వాహనాన్ని పరిశీలిస్తున్నారు.
హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ భార్య కమలేష్ ఠాకూర్‌కు అసెంబ్లీ సీటు దక్కింది. డెహ్రాలో జరగనున్న ఉప ఎన్నికల్లో కమలేష్ ఠాకూర్ పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆమె పేరును అధికారికంగా ప్రకటించింది.
సాయంత్రం ఢిల్లీలో ఎన్డీఏ కూటమి కీలక భేటీ జరగనుంది. సాయంత్రం 5 గంటలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇంట్లో ఈ సమావేశం జరగనుంది. కేంద్ర మంత్రులు, బీజేపీ మిత్రపక్షాలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ భేటీలో ప్రధానంగా లోక్‌సభ స్పీకర్ ఎన్నికపై చర్చ జరగనుంది.
స్నేహితుడితో కలిసి ఆ యువతి విహార యాత్రకు వెళ్లింది. టూరిస్టు స్థలాలను మిత్రుడితో కలిసి సందర్శించింది. ఎంతో సంతోషంగా గడిపింది. మనసులో ఏం పుట్టిందో ఏమో.. కారు నడిపే అలవాటు ఉందో లేదో తెలియదు గానీ.. డ్రైవింగ్ సీటులో కూర్చుని వెనక్కి డ్రైవ్ చేస్తోంది. ఇంకోవైపు మిత్రుడు మొబైల్లో రికార్డ్ చేస్తు్న్నాడు.
దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి తాజా రికార్డ్ సొంతం చేసుకున్నాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ముగింపు వరకు అదే ఒరవడిని కొనసాగించాయి. ఇలా నిఫ్టీ అయితే ఆల్ రికార్డ్ సొంతం చేసుకుంది. 23, 560 మార్కును క్రాస్ చేసింది.
శనివారం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పెట్రోల్‌పై 29.84 శాతం, డీజిల్‌పై 18.44 శాతం అమ్మకం పన్ను పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్ రూ.3, డీజిల్ రూ.3.05 చొప్పున పెరిగింది.
గాజాపై యుద్ధం సాగిస్తున్న వేళ ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం తీసుకుంది. యుద్ధ నిర్ణయాల్లో కీలకమైన వార్ కేబినెట్‌ను రద్దు చేసింది. దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వార్ కేబినెట్‌ను రద్దు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
దేశ వ్యాప్తంగా కురిసిన వర్షాలపై కేంద్ర వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది వర్షాకాల సీజన్లో ఇప్పటివరకు సాధారణం కంటే సగటున 20 శాతం వర్షాలు తక్కువగా పడ్డాయని భారత వాతావరణశాఖ తెలిపింది.