కేంద్రంలో మోడీ 3.0 సర్కార్ ఏర్పడిన తర్వాత లేటెస్ట్గా ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చింది. ఎన్డీఏ మిత్ర పక్షాల నుంచే ఈ డిమాండ్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రస్తుతం మిత్ర పక్షాల సపోర్ట్ పిల్లర్స్పై ఆధారపడి ఉంది.
వచ్చే నెలలో కజకిస్థాన్లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సుకు ప్రధాని మోడీ దూరం అయ్యారు. మోడీ తరపున కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరుకానున్నారు. భారత ప్రతినిధి బృందానికి కేంద్రమంత్రి నాయకత్వం వహించనున్నారు .
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం దేశ వ్యాప్తంగా దుమారం చెలరేగుతున్న సమయంలో లోక్సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ విద్యార్థులను ఉద్దేశించి వీడియో విడుదల చేశారు. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై మోడీ ప్రభుత్వంతో చర్చలు జరపడమే ఇండియా కూటమి లక్ష్యమని స్పష్టం చేశారు.
చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్రం శుక్రవారం యథాతథంగా ఉంచింది. గత త్రైమాసికంలో కూడా లోక్సభ ఎన్నికలకు ముందు ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి ప్రభుత్వం వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది.
శుక్రవారం మహారాష్ట్ర అసెంబ్లీలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భారీగా తాయిలాలు ప్రకటించారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీగా నష్టపోయింది. ఆశించిన ఫలితాలు రాకపోవడంతో డీలా పడింది.
అమెరికా వెళ్లేందుకు.. అక్కడ చదువు కునేందు అడ్డదారులు తొక్కాడు ఓ భారతీయ విద్యార్థి. అందుకోసం ఏకంగా కన్న తండ్రినే పత్రాల్లో చంపేశాడు. తొలుత పదో తరగతి బోర్డు పరీక్షల ఫలితాలను తారుమారు చేసి.. ఇప్పుడు ఏకంగా స్కాలర్షిప్తో యూఎస్ కాలేజీ అడ్మిషన్ పొందేందుకు అక్రమార్గాలను ఎంచుకుని కటకటాలపాలయ్యాడు.
లోక్సభ సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను రాష్ట్ర ప్రభుత్వాలు పెంచేస్తు్న్నాయి. ఇప్పటికే కర్ణాటక, గోవా లాంటి రాష్ట్రాల్లో ఫ్యూయిల్ ధరలను పెంచేశాయి. కానీ మహారాష్ట్రలో మాత్రం విచిత్రమైన పరిస్థితి చోటుచేసుకుంది.
రెండ్రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షానికి దేశ రాజధాని ఢిల్లీ అతలాకుతలం అయింది. దీంతో రోడ్లు, ఇళ్లు జలమయం అయ్యాయి. ఇక లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం.. ఇంకోవైపు ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో జనాలు నానా అవస్థలు పడుతున్నారు. ఇక ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది.
దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి విచిత్రంగా మారింది. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్న చందాగా మారింది. నిన్నామొన్నటి దాకా తీవ్రమైన వేడి.. నీటి ఎద్దడితో అల్లాడిన ప్రజలకు రెండ్రోజుల ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. రెండ్రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న తవర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి.