Maharashtra Budget: ముందుగానే ప్రజలకు ఎన్నికల తాయిలాలు.. బడ్జెట్ అంతా వరాలే
- మహారాష్ట్ర అసెంబ్లీలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బడ్జెట్ వరాలు
- ఏడాదికి ఉచితంగా మూడు సిలిండర్లు
- రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శుక్రవారం మహారాష్ట్ర అసెంబ్లీలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భారీగా తాయిలాలు ప్రకటించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీగా నష్టపోయింది. ఆశించిన ఫలితాలు రాకపోవడంతో డీలా పడింది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలే లక్ష్యంగా బడ్జెట్ ప్రకటనలో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది.
బడ్జెట్ ముఖ్యాంశాలు ఇవే..
‘‘ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్’’ పథకం కింద 21 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలకు నెలకు రూ.1,500 అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఇక 10 లక్షల మంది ఇంటర్న్‌లకు నెలకు రూ.10,000 స్టైఫండ్ అందించే పథకాన్ని కూడా ప్రకటించారు. పంట నష్టానికి పరిహారంగా చెల్లించాల్సిన గరిష్ట మొత్తం రూ. 50,000కి పెంచారు. ఆవు పాల రైతులకు లీటర్‌కు రూ.5 సబ్సిడీ ఇస్తామని వెల్లడించారు. అంతేకాకుండా 44 లక్షల మంది రైతులకు విద్యుత్ బిల్లు బకాయిలు మాఫీ చేస్తామని రాష్ట్ర అసెంబ్లీలో అజిత్ పవార్ ప్రకటించారు. దీంతో పాటు ముంబై ప్రాంతంలో పెట్రోల్‌పై పన్నును 26 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అంటే పెట్రోల్ ధరలు లీటరుకు 65 పైసలు తగ్గుతాయి. ఇక డీజిల్‌పై పన్నును 24 శాతం నుంచి 21 శాతానికి పన్ను తగ్గించారు. దీంతో ముంబై ప్రాంతంలో డీజిల్ ధర లీటర్‌కు రూ.2 తగ్గుతాయని ఆయన తెలిపారు. అలాగే పేద కుటుంబాలకు ప్రతి సంవత్సరం మూడు ఉచిత ఎల్‌పిజి సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు.
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
- INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
అక్టోబర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. మరోసారి అధికారం కోసం ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇంకోవైపు ఇండియా కూటమి నేతలకు కూడా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. మరీ మహారాష్ట్ర ప్రజలు ఎవరికి అధికారం కట్టబెడతారో చూడాలి.
తాజావార్తలు
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!