Delhi floods: నీట మునిగిన జలమంత్రి అతిషి నివాసం.. పలువురి మంత్రులు, ఎంపీల ఇళ్లు
- దేశ రాజధాని ఢిల్లీని ముంచెత్తిన వరదలు
- నీట మునిగిన జలమంత్రి అతిషి నివాసం
- నీటిలోనే పలువురి మంత్రులు.. ఎంపీల ఇళ్లు
- విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అవస్థలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండ్రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షానికి దేశ రాజధాని ఢిల్లీ అతలాకుతలం అయింది. దీంతో రోడ్లు, ఇళ్లు జలమయం అయ్యాయి. ఇక లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం.. ఇంకోవైపు ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో జనాలు నానా అవస్థలు పడుతున్నారు. ఇక ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది.
భారీ వర్షం కారణంగా సాధారణ పౌరులతో పాటు రాజకీయ నేతలు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపపథ్యంలో ఢిల్లీలో ఉన్న పలువురు ఎంపీల నివాసాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఇంటి చుట్టూ నీరు నిలిచిపోవడంతో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. తన ఇల్లంతా వర్షపు నీరుతో నిండిపోయినట్లు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పేర్కొన్నారు. ఇంట్లో అడుగు ఎత్తు నీరు చేరిపోయిందని. ప్రతి గదిలో కార్పెట్‌లు, ఫర్నీచర్ ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. అంతేగాక కరెంట్ షాక్ వస్తుందనే ఉద్ధేశంతో ఉదయం 6 గంటల నుంచి అధికారులు విద్యుత్‌ను నిలిపివేసినట్లు తెలిపారు. ఇక ఢిల్లీ జల మంత్రి అతిషి నివాసం కూడా నీట మునిగింది. ఇటీవల ఢిల్లీలో నీటి కొరత నేపథ్యంలో నిరాహార దీక్ష చేశారు. తాజాగా మంత్రి నివాసం దగ్గర నీరు చేరిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Also Read
- Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
మరోవైపు భారీ వర్షాలతో లోధి ఎస్టేట్ ప్రాంతంలోని తన బంగ్లా వెలుపల రహదారి జలమయం కావడంతో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంటిముంందు ఉన్న నీటిలో నుంచి కారు దగ్గరకు వెళ్లేందుకు సిబ్బంది ఎత్తుకొని తీసుకెళ్లారు. తన బంగ్లా మొత్తం జలమయమైందని ఎంపీ తెలిపారు. రెండు రోజుల క్రితమే ఫ్లోరింగ్ పూర్తి చేశామని.. లక్షల్లో నష్టం వాటిల్లిందని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఇక భారీ వర్షం కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టు కూడా జలమయం అయింది. పైకప్పు నుంచి వర్షం నీరు కారుతుంది. ఇంకో వైపు టెర్నినల్ -1 పైకప్పు కూలిపోవడంతో ఒకరు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. ఇక తాజా పరిణామాలపై మంత్రి అతిషి సమీక్ష నిర్వహించారు.
This is the corner just outside my home in Lutyens’ Delhi. Woke up to find my entire home under a foot of water — every room. Carpets and furniture, indeed anything on the ground, ruined. Apparently the storm water drains in the neighbourhood are all clogged so the water had no… pic.twitter.com/mublEqiGqG
— Shashi Tharoor (@ShashiTharoor) June 28, 2024
#WATCH | Delhi: SP MP Ram Gopal Yadav being helped by members of his staff and others to his car as the area around his residence is completely inundated.
Visuals from Lodhi Estate area. pic.twitter.com/ytWE7MGbfY
— ANI (@ANI) June 28, 2024
#WATCH | Delhi Minister Atishi says, "…We conducted an emergency meeting regarding the waterlogging issue due to the heavy rainfall. It was chaired by 4 ministers of the Delhi government… It was attended by all the senior officials of the Delhi government. We made several… pic.twitter.com/MLYCPqfTe0
— ANI (@ANI) June 28, 2024
తాజావార్తలు
-
Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
-
NBK 111 : ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ మాట బాలయ్య వినడం లేదా?
-
Tuesday Rasi Phalalu: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
Celebrity Marriage: తమ్ముడితో హీరోయిన్గా నటించి.. అన్నను పెళ్లాడిన భామలు వీరే! ఈ లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!