పశ్చిమబెంగాల్లో నడిరోడ్డుపై ఓ జంటపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత దాడి చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మమతాబెనర్జీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదంటూ పెద్ద ఎత్తున బీజేపీ విమర్శలు గుప్పించింది.
సీబీఐ అరెస్టును వ్యతిరేకిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై సీబీఐ స్పందనను న్యాయస్థానం కోరింది. ఈ మేరకు దర్యాప్తు సంస్థనకు నోటీసులు జారీ చేసింది. అనంతరం ఈ కేసును జూలై 17న విచారణకు వాయిదా వేసింది.
దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల వాతావరణంతో మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. మొదట్లో సూచీలు బాగానే ట్రేడ్ అయినా.. అనంతరం నెమ్మదిగా నష్టాల్లోకి జారుకున్నాయి.
దేశ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాయి. దీంతో ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో అయితే వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు మృత్యువాత పడగా.. మరికొందరు నివాసాలు కోల్పోయి నిరాశ్రయులయ్యారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ.. బీజేపీ లక్ష్యంగా విమర్శల దాడి కొనసాగించారు. దీనికి మోడీ సహా బీజేపీ ఎంపీలు మధ్యమధ్యలో అడ్డుకుంటూనే ఉన్నారు. ఇక మధ్యలో రాహుల్ మతపరమైన బొమ్మలు చూపించడంపై అమిత్ షా ఎదురుదాడి చేశారు.
ఇండియా టీ 20 క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్న సందర్భంగా భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులంతా గెలుపు సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకుని.. బాణసంచా కాల్చి వేడుకలు జరుపుకున్నారు.
56 ఏళ్ల వయసులో ఆర్మీ మేజర్ జనరల్ విరామం లేకుండా 25 పుల్-అప్‌లను ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైలర్‌గా మారింది. ఈ వీడియోను ఈ 1.4 లక్షల వీక్షించగా.. నాలుగు వేల లైక్‌లు వచ్చాయి.
క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్లి ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన గుజరాత్‌లోని చిఖోద్రాలో చోటుచేసుకుంది. ఇరవై మూడేళ్ల సల్మాన్ వోహ్రా జూన్ 22న గుజరాత్‌లోని చిఖోద్రాలో క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ చూడటానికి వెళ్లాడు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) 2024 పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. దేశవ్యాప్తంగా జూన్ 16న పరీక్ష నిర్వహించారు. మెయిన్స్ పరీక్షకు క్వాలిఫై అయిన అభ్యర్థుల రోల్ నంబర్లతో జాబితాను విడుదల చేసింది.
దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం వెల్లడించింది.