Indrajaal Ranger: హైదరాబాద్‌లో ఈరోజు ప్రపంచపు తొలి మొబైల్, AI ఆధారిత యాంటీ-డ్రోన్ పెట్రోల్ వెహికల్ ‘ఇంద్రజాల్ రేంజర్’ (Indrajaal) అధికారికంగా లాంచ్ అయ్యింది. సాధారణంగా ఒకేచోట స్థిరంగా ఉండే యాంటీ-డ్రోన్ సిస్టమ్‌లకు భిన్నంగా.. ఇది కదులుతున్న డ్రోన్లను గుర్తించి, ట్రాక్ చేసి, నిర్వీర్యం చేసే సామర్థ్యంతో రూపొందించబడిన అత్యాధునిక టెక్నాలజీతో కూడిన వాహనం.
యాంటీ-డ్రోన్ టెక్నాలజీ అవసరం ఎందుకు?
ఇటీవలి కాలంలో బార్డర్ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా డ్రగ్స్, ఆయుధాలు, స్మగ్లింగ్ వస్తువులు తరలింపు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఢిల్లీ బ్లాస్ట్ వంటి ఘటనల్లో కూడా డ్రోన్లను ఉపయోగించి సరిహద్దుల నుంచి అక్రమ వస్తువులు దేశీయ నగరాలకు చేరుతున్నాయి. ఈ పెరుగుతున్న ముప్పు నుంచి రక్షించడానికి సమాధానంగా ఇంద్రజాల్ రేంజర్ రూపొందించబడింది.
బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ ఫీచర్స్.. REDMI 15C 5G భారత్ లాంచ్ కు రంగం సిద్ధం..!
ఇంద్రజాల్ రేంజర్ 10 కి.మీ పరిధిలో డ్రోన్ డిటెక్షన్ చేస్తుంది. ఈ వాహనం 10 కిలోమీటర్ల రేడియస్‌లో ఉన్న ఏ డ్రోన్‌నైనా వెంటనే గుర్తించే సామర్థ్యం కలిగి ఉంది. అలాగే ఇది ఇతర సిస్టమ్‌ల మాదిరిగా ఆపి మళ్లీ సెటప్ చేయాల్సిన అవసరం లేదు. డ్రోన్ డిటెక్ట్ అయిన వెంటనే డ్రైవర్ ఆ దిశగా వెహికల్‌ను తీసుకెళ్లి ఆపరేషన్‌ను కొనసాగించవచ్చు. ఇక 4 కి.మీ రేంజ్‌లో వాహనంలోని AI సిస్టమ్ డ్రోన్‌ను హ్యాక్ చేసి, వెహికల్ పక్కనే సురక్షితంగా ల్యాండ్ చేయిస్తుంది.
ఒకవేళ హ్యాకింగ్ విఫలమైతే.. క్రాష్ మెకానిజం ద్వారా డ్రోన్‌ను కొలిచివేయగలదు. ఇంకా పనిచేయకపోతే వెనుక అమర్చిన ప్రత్యేక ఆపరేషన్ డ్రోన్‌ను లాంచ్ చేసి ప్రత్యర్థి డ్రోన్‌ను అడ్డుకుంటుంది. ఈ ఇంద్రజాల్ రేంజర్ పూర్తిగా ఆధునిక AI సిస్టమ్‌తో నడుస్తుంది. AI స్వయంగా డ్రోన్లను గుర్తించి, న్యూట్రలైజ్ చేస్తుంది. సిస్టమ్ ఏ ఇతర ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉండదు. అందువల్ల హ్యాకింగ్ ప్రమాదం పూర్తిగా తగ్గుతుంది
ఈ వెహికల్‌లో రాడార్ టెక్నాలజీ లేకపోవడం వల్ల శత్రువులు దీనిని సులభంగా గుర్తించలేరు. అంతేకాకుండా ఇది 5 కిలోమీటర్ల దూరం నుంచే ముప్పులను ముందుగానే గుర్తించే సామర్థ్యం కలిగి ఉంది. బార్డర్ పరిస్థితులకు తగినట్టుగా టఫ్ బాడీతో, హై-ఎండ్ సేఫ్టీ ప్రమాణాలతో తయారు చేయబడింది. ఈ వెహికల్‌ను బార్డర్ సెక్యూరిటీ, పోలీసు విభాగాలు, నగర భద్రత, పెద్ద ర్యాలీలు, మతపరమైన ఈవెంట్లు, రాజకీయ సభల్లో మానిటరింగ్, సినిమా సెట్స్, సెన్సిటివ్ ఏరియాలలో ఉపయోగిస్తారు. వీటితోపాటు అత్యంత కీలకమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రక్షణ అంటే.. న్యూక్లియర్ ప్లాంట్లు, ఆయిల్ రిఫైనరీస్, ఎయిర్‌పోర్టులు, మిలిటరీ ఉపయోగం కూడా ఉన్నప్పటికీ, నాన్-మిలిటరీ రంగాల్లో దీనికి మరింత విస్తృత ఉపయోగం ఉంటుంది.
DMV Vehicle: రోడ్డుపై బస్సులాగా.. ట్రాక్‌లపై రైలులాగా.. 15 సెకన్లలో మోడ్ మారే వెహికల్(వీడియో)
ఇక వాహనం అంతర్గత భాగం చాలా బలంగా, హై-సెక్యూరిటీ ప్రమాణాలతో రూపుదిద్దుకుంది. డ్రైవర్ సీట్ నుంచే అన్ని ఆపరేషన్‌లను నియంత్రించడానికి పెద్ద స్క్రీన్, ఇన్‌బిల్ట్ ప్రాసెసింగ్ యూనిట్లు అమర్చబడ్డాయి. వెనుక భాగంలో ఉన్న ప్రత్యేక ఆపరేషన్ డ్రోన్ ఈ మొత్తం సిస్టమ్‌కు హృదయంగా పనిచేస్తుంది.