లండన్‌లో లేబర్ పార్టీ చారిత్రాత్మక విజయం సాధించింది. కీర్ స్టార్మర్ ప్రధానమంత్రి అయ్యారు. అనంతరం బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కింగ్ చార్లెస్-3ని కలిశారు. కింగ్ ఛార్లెస్-3... కీర్ స్టార్మర్నియామకాన్ని ఆమోదించారు.
పంజాబ్‌లో పట్టపగలు నడిరోడ్డుపై కత్తులతో చెలరేగిపోయారు. అందరూ చూస్తుండగానే శివసేన నాయకుడిపై దాడులకు తెగబడ్డారు. చుట్టూ జనం ఉన్నా.. ఒక్కరూ ఆపే ప్రయత్నం చేయలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
బీహార్ రాష్ట్రంలో వరుసగా వంతెనలు కూలిపోవడం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రెండు వారాల్లో 12 బ్రిడ్జిలు కూలిపోయాయి. దీంతో రాజకీయంగా నితీష్ కుమార్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఖలిస్థాన్ వేర్పాటువాది అమృతపాల్ సింగ్, అవామీ ఇత్తెహాద్ పార్టీ వ్యవస్థాపకుడు షేక్ అబ్దుల్ రషీద్ శుక్రవారం ఎంపీలుగా ప్రమాణం చేశారు. స్పీకర్ ఛాంబర్లో ఓం బిర్లా వీరిద్దరి చేత ప్రమాణం చేయించారు. పెరోల్‌పై వచ్చి లోక్‌సభ ఎంపీలుగా ప్రమాణం చేశారు.
టెక్సాస్ సముద్రంలో షార్క్ చేప తీరంలో బీభత్సం సృష్టించింది. బీచ్‌లో స్నానం చేస్తుండగా టూరిస్టులపై ఒక్కసారిగా దాడి చేసింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సహచర పర్యాటకులు సొరచేప నుంచి రక్షించారు.
ముంబై మున్సిపల్ కార్మికులకు గురువారం రాత్రి నుంచి చుక్కలు కనిపించాయి. నగరంలో ఎన్నడూ చూడని చెత్తను చూసి వర్కర్స్ అవాక్కయ్యారు. కొన్ని గంటల పాటు వేల కిలోల వ్యర్థాలు సేకరించి రికార్డు సృష్టించారు.
హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం నగరంలో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. నగరంలో ఒకే సమయంలో రెండు అతి పెద్ద ర్యాలీలు జరగనున్నాయి. ఇందుకోసం నగరంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. శుక్రవారం ఆరంభంలోనే నష్టాలతో ప్రారంభమైంది. చివరిదాకా అలానే ట్రేడ్ అయింది. ఆసియా మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు మన సూచీలపై తీవ్ర ప్రభావం చూపాయి.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ట్రయల్ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. జ్యుడీషియల్ రిమాండ్‌ను జూలై 18 వరకు న్యాయస్థానం పొడిగించింది. ఇదిలా ఉంటే పలుమార్లు కవిత బెయిల్ పిటిషన్లు వేసింది.
నీట్ వ్యవహారం దేశ వ్యాప్తంగా పెను దుమారం రేపింది. గత కొద్ది రోజులుగా ఈ వ్యవహారంతో అట్టుడుకుతోంది. పరీక్ష రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు.