ఆస్ట్రేలియాలో ఘోరం జరిగింది. రైలు ఢీకొని భారతీయ టెకీ (40) ఆనంద్ రన్వాల్, అతని కుమార్తె మృతిచెందారు. మరో కుమార్తె గాయపడగా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని కార్ల్టన్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది.
మరికొన్ని గంటల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌పై అన్ని వర్గాల వారు ఆశలు పెట్టుకున్నారు. ప్రాముఖ్యంగా సీనియర్ సిటిజన్లు భారీగా ఆశలు పెట్టుకున్నారు.
బీహార్‌కు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చిచెప్పిన నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ నుంచి నితీష్ కుమార్ బయటకు రావాలని.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ముంబై నేవల్ డాక్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మెయింటెనెన్స్‌లో ఉన్న ఇండియన్ నేవీ యుద్ధనౌకలో సోమవారం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నావికాదళానికి చెందిన జూనియర్ నావికుడు తప్పిపోయాడని, రెస్క్యూ టీమ్ అతని కోసం వెతుకుతోందని అధికారులు చెప్పారు.
మరికొన్ని గంటల్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో 2024-25 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక సామవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
దేశ రాజధాని ఢిల్లీలో ఓ బస్సు బీభత్సం సృష్టించింది. ఎలక్ట్రిక్ బస్సు మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టడంతో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా.. మరో 24 మందికి గాయాలయ్యాయి. ఢిల్లీలోని పంజాబీ బాగ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. చెవుల్లో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని ఇద్దరు యువకులు రైల్వేట్రాక్‌పై కూర్చుని సంగీతం వింటున్నారు. సంగీతంలో లీనమైపోయి.. కనీసం రైలు హారన్ కూడా వినిపించలేదు.
పెళ్లంటే నూరేళ్ల పంట అన్నారు పెద్దలు. నూతనంగా పెళ్లి చేసుకునే వారు ఎంతో సంతోషంగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలని కలలు కంటారు. కానీ నేటి యువత అందుకు భిన్నంగా ఉన్నారు.
గాజాపై ఇజ్రాయెల్ భీకరమైన యుద్ధాన్ని కొనసాగిస్తోంది. గత తొమ్మిది నెలలుగా హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి చేస్తూనే ఉంది. ఇప్పటికే వందలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. గత అక్టోబర్ 7న హమాస్ హఠాత్తుగా.. ఇజ్రాయెల్‌పై దాడి చేసింది.
గత శుక్రవారం మైక్రోసాఫ్ట్ విండోస్ సమస్యతో ప్రపంచ మంతా అల్లాడిపోయింది. తాజాగా భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో వీడియో ప్లాట్‌ఫామ్ అయిన యూట్యూబ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.