పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. కోల్‌కతాలో ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గేటు ఒక్కసారిగా కూలిపోయింది.
దేశ వ్యాప్తంగా 2024లో జరిగిన నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. పేపర్ లీక్ కారణంగా పరీక్ష రద్దు చేయాలంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలయ్యాయి.
మహారాష్ట్రలోని థానేకు చెందిన మహిళ.. పాకిస్థాన్‌కు చెందిన యువకుడితో ఆన్లైన్ ప్రేమలో పడింది. 2024, ఫిబ్రవరిలో ఇద్దరూ ఆన్లైన్లోనే వావాహం చేసుకున్నారు. దీంతో ఆమె.. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి పాకిస్థాన్ వెళ్లిపోయింది.
సముద్ర జలాల్లో అంతర్జాతీయ సరిహద్దు దాటిన తొమ్మిది మంది తమిళనాడు మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్ట్ చేసింది. రెండు పడవలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన మత్స్యకారులను కంగేసంతురై నేవల్ క్యాంపునకు తరలించారు.
దేశీయ స్టాక్ మార్కెట్లో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. కేంద్ర బడ్జెట్ తర్వాత కూడా ఎలాంటి మార్పులు కనిపించలేదు. గత శుక్రవారం మైక్రోసాప్ట్ విండోస్ సమస్యతో మొదలైన నష్టాలు.. వరుసగా నాలుగో రోజు కూడా అదే ఒరవడి కొనసాగింది.
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ జాడ గత ఐదు రోజుల నుంచి కనిపించడం లేదు. ఇంట్లోనూ లేదు.. ఫోన్లు కూడా పని చేయడం లేదు. దీంతో ఆమె ఆచూకీ కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు.
గుజరాత్లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు నివాసాలు నీళ్లలో మునిగి ఉన్నాయి. ఇక భారీ వర్షాల కారణంగా మంగళవారం గుజరాత్‌లోని ద్వారకలోని ఖంభాలియా తాలూకాలో మూడు అంతస్తుల ఇల్లు కూలిపోయింది.
పార్లమెంట్లో సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై దేశ వ్యాప్తంగా విపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. ఇక ఇండియా కూటమి నేతలు ఆరోపణలు గుప్పించారు.
యూపీఎస్సీ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి ఉద్యోగం సంపాదించడంపై పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. లోక్‌సభ స్పీకర్ కుమార్తె కాబట్టి ఏదైనా సాధ్యమేనంటూ విపరీతంగా ఆమెపై నెట్టింట ట్రోల్స్ నడిచాయి.