అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నానికి బాధ్యత వహిస్తూ అమెరికా సీక్రెట్ సర్వీస్ చీఫ్ కింబర్లీ చీటిల్ రాజీనామా చేశారు. ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై ఎటాక్ జరిగింది. ఈ ఘటనలో ట్రంప్ చెవికి గాయమైంది.
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజ ఖేద్కర్ వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఆమె శిక్షణను యూపీఎస్సీ నిలిపివేసింది. ఇంకోవైపు కేంద్ర దర్యాప్తు కూడా కొనసాగుతోంది.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు భేటీ అయ్యారు. ఢిల్లీలోని ఖర్గే ఇంట్లో ఈ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంగళవారం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్, సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలంతా చర్చిస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. కలకాలం తోడుగా ఉండాల్సి భర్తే కాలయముడయ్యాడు. గర్భిణీగా ఉన్న భార్యను ముక్కలు ముక్కులుగా నరికి సజీవదహనం చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఇటలీలో మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం మరోసారి భారీ విస్ఫోటనం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున బూడిద వెదజల్లుతోంది. బూడిద కారణంగా ఇటలీలోని కాటానియా విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు.
ఇథియోపియాను భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. మరోవైపు పెద్ద ఎత్తున బురద జలాలు ఏరులైపారడంతో 157 మంది ప్రాణాలు కోల్పోయారు. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది పలువుర్ని కాపాడారు.
అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ఓ నైట్‌క్లబ్ దగ్గర దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా.. మరో 13 మంది గాయపడ్డారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చర్చి స్ట్రీట్‌లో ఉన్న నైట్‌క్లబ్ దగ్గర కాల్పులు జరిగాయి.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా ఐఆర్పీఎస్ అధికారిణిగా ఎంపికైన తర్వాత పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి. తండ్రి ఓం బిర్లా పలుకుబడి ఉపయోగించి అంజలి ఉద్యోగం సంపాదించిందని.. యూపీఎస్సీ పరీక్షల్లో నెగ్గుకు రాగలిగారని నెటిజన్లు ట్రోల్స్ చేశారు.
పార్లమెంట్లో మంగళవారం సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రుచించలేదు. వరుసగా మూడో రోజు స్టాక్ మార్కెట్ నష్టాలను చవిచూసింది. శుక్రవారం భారీగా పతనమైన సూచీలు.. బడ్జెట్ ముందు పుంజుకుంటుందని భావించారు.
పార్లమెంట్లో మంగళవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని తగ్గించడం, పెంచడం వంటి చర్యలతో రిటైల్ మార్కెట్లో ఆయా వస్తువుల ధరలపై ప్రభావం చూపించనుంది. తాజా బడ్జెట్‌తో ఏవి పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయో చూద్దాం.