టీమిండియా క్రికెటర్ దీపక్ హుడా ఈనెల 15న ఓ ఇంటివాడయ్యాడు. దాదాపు నాలుగు రోజుల తర్వాత శుక్రవారం (19-07-2024) తన పెళ్లి ఫొటోలను ఇన్‌స్ట్రాగామ్‌లో షేర్ చేశాడు. బంధుమిత్రలు, శ్రేయోభిలాషుల మధ్యలో వివాహం జరిగినట్లుగా పేర్కొన్నాడు.
ఇస్రో చైర్మన్ సోమనాథ్ మద్రాస్ ఐఐటీ నుంచి పీహెచ్డీ పట్టాను అందుకున్నారు. శుక్రవారం ఐఐటి-మద్రాస్ 61వ స్నాతకోత్సవం జరిగింది. ఈ సందర్భంగా యూనివర్సిటీ.. ఇస్రో చైర్మన్‌కు పట్టాను ప్రధానం చేసింది. ఒక పలెటూరి అబ్బాయి కల నెరవేరిందని సోమనాథ్ పేర్కొన్నారు.
గురువారం తెలంగాణలో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జిల్లాల్లో రెడ్ అలర్ట్ అమల్లో ఉండనుంది. జూలై 21 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని తెలిపింది.
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీని కలవలేకే తన తండ్రి రామ్‌విలాస్ పాశ్వాన్ యూపీఏ నుంచి బయటకు వచ్చేశారని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. కదులుతున్న కారులోనే ఆమెపై ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తలెత్తిన సమస్య కారణంగా అన్ని సంస్థలను అతలాకుతలం చేసింది. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. గురువారం సెన్సెక్స్, నిఫ్టీ జీవితకాల గరిష్టాలను నమోదు చేసిన సూచీలు.. శుక్రవారం మాత్రం అందుకు భిన్నంగా తిరోగమనంలో కొనసాగాయి.
జార్ఖండ్‌లో అసిస్టెంట్ పోలీస్ సిబ్బంది తమ డిమాండ్ల కోసం రోడ్డెక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనకు పూనుకున్నారు. తమ జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. రాజధాని రాంచీకి భారీగా పోలీస్ సిబ్బంది తరలివచ్చారు.
ప్రైవేట్ ఉద్యోగాల కోటాపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన ప్రకటన తీవ్ర దుమారం రేపింది. ప్రైవేటు సంస్థల్లో స్థానికులకే 100 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఎక్స్ ట్విట్టర్లో పోస్టు చేయగానే.. ఆయా కంపెనీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ-నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం జూలై 12న ముంబై జియో వరల్డ్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి దేశ, విదేశాల నుంచి అతిరథ మహరథులంతా హాజరయ్యారు.
బీహార్ రాష్ట్రంలో వరుస వంతెనలు కూలడం దేశ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఇప్పటికే అక్కడ డజన్‌కు బ్రిడ్జ్‌లు కూలిపోయాయి. ఇప్పుడు ఉత్తరాఖండ్ వంతు వచ్చింది. తాజాగా నిర్మాణంలో ఉన్న ఓ సిగ్నేచర్ బ్రిడ్జ్ కూలిపోయింది