ఆర్థిక రాజధాని ముంబైను భారీ వర్షం ముంచెత్తింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రహదారులన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ముంబైలో ఓ వాచ్‌మన్ అఘాయిత్యానికి తెగబడ్డాడు. బ్రాండ్ మేనేజ్మెంట్ కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్‌పై అత్యాచారయత్నానికి పూనుకున్నాడు. మహిళ ఎదురు తిరగడంతో కత్తితో దాడికి యత్నించాడు. అదృష్టం కొద్ది ఆమె ప్రాణాలతో బయటపడి ఆస్పత్రిలో చేరింది.
గురువారం సాయంత్రం మెక్రోసాఫ్ట్ విండోస్‌లో తలెత్తిన సమస్య కారణంగా అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా విమానాలు, బ్యాంకులు, మీడియా సంస్థలు, మార్కెట్లు, ఆయా కంపెనీలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
మైక్రోసాఫ్ట్ విండోస్‌లో ఏర్పడిన సాంకేతిక లోపంపై భారతీయ రిజర్వు బ్యాంకు స్పందించింది. సాంకేతిక లోపం కారణంగా భారత్‌లోని 10 బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ సేవల్లో స్వల్ప అంతరాయం ఏర్పడినట్లు ఆర్బీఐ వెల్లడించింది.
తనపై వచ్చిన ఆరోపణలపై రీకాల్ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తొలిసారి స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆమె వ్యాఖ్యానించారు. ఏవైనా ప్రశ్నలుంటే యూపీఎస్‌కు సమాధానం ఇస్తానని.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడతానని ఆమె వ్యాఖ్యానించారు.
టాటూ ఒక ఆర్టిస్టును ఇబ్బందుల్లోకి నెట్టింది. ఛాతీపై పచ్చబొట్టు వేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ టాటూ పోలీసుల్ని కించపరిచేలా ఉందని విమర్శలు వెల్లువెత్తాయి.
మామూలుగా చిన్న.. చిన్న పాములు కనిపిస్తేనే.. గుండెలు జారుకుంటాయి. అవి కనబడితేనే.. కొంత మందికి చెమటలు పడుతుంటాయి. అలాంటిది 12 అడుగుల పొడవైన కింగ్ కోబ్రా ప్రత్యక్షమైతే ఇంకెలా ఉంటుంది.
అత్యధిక ఉష్ణోగ్రతలు దుబాయ్‌ను హడలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం తేమ, వేడి అధికంగా ఉంది. ఇది ప్రజలకు అత్యంత ప్రమాదకరమని శాస్త్రవేత్తలు వార్నింగ్ ఇస్తు్న్నారు. జూలై 17న 43 డిగ్రీల సెలియస్‌కు చేరుకోగా.. రెండు రోజుల్లోనే అమాంతంగా పెరిగిపోయింది.