పెళ్లంటే నూరేళ్ల పంట అన్నారు పెద్దలు. నూతనంగా పెళ్లి చేసుకునే వారు ఎంతో సంతోషంగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలని కలలు కంటారు. కానీ నేటి యువత అందుకు భిన్నంగా ఉన్నారు. వివాహం యొక్క ప్రాముఖ్యత తెలియకో.. లేదంటే అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలో తెలియకో.. ఏమో తెలియదు గానీ.. చిన్న చిన్న కారణాలకే బీపీలు పెంచుకుని కోపావేశాలకు గురై పచ్చని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఓ జంట అర్ధాంతరంగా వివాహ బంధాన్ని ముగించేశారు. అసలేం జరిగింది. ఎందుకు అంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఇది కూడా చదవండి: Guest Lecturers: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు గుడ్ న్యూస్..
కువైట్‌లో పెళ్లైన 3 నిమిషాలకే ఓ వివాహం పెటాకులైంది. విచిత్రమేంటంటే అందుకు న్యాయమూర్తి కూడా సమ్మతి తెల్పడం విశేషం. కేవలం చిన్న కారణానికే ఈ జంట విడాకులు తీసేసుకున్నారు. పెళ్లి వేదికపై వరుడు.. అవమానించాడని వధువు మనస్తాపానికి గురై మ్యారేజ్‌ను రద్దు చేసుకుంది. తనకు విడాకులు ఇప్పించాలని జడ్జిని కోరింది. ఆమె విజ్ఞప్తిని అంగీకరించిన న్యాయమూర్తి.. భార్యాభర్తలుగా ప్రకటించిన 3 నిమిషాలకే వారిద్దరికి విడాకులు మంజూరు చేశాడు. ఈ ఘటన 2019లో చోటుచేసుకుంది. కానీ ఇప్పుడు తాజాగా వైరల్ అవుతోంది. గతంలో జరిగిన సంఘటనను ఎక్స్ ట్విట్టర్‌గా పోస్టు చేయగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. చరిత్రలోనే అతి చిన్న పెళ్లిగా చెప్పుకోవచ్చు.
ఇది కూడా చదవండి: Vijay: త్రిష, రంభలతో విజయ్.. అసలు మ్యాటర్ ఇదా?
అయితే ఈ పోస్టుపై నెటిజన్లు రకరకాలైన కామెంట్లు చేస్తున్నారు. ప్రారంభంలోనే ఇలా విడిపోవడం మంచిదైందని వ్యాఖ్యానించారు. పెళ్లయ్యాక రోజు గొడవ పడేకంటే అప్పుడే విడిపోవడం కరెక్ట్ అని రాసుకొచ్చారు. మరికొందరు ఆయా రకాలుగా అభిప్రాయాలు పంచుకున్నారు.
ఇక 2004లో యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఒక జంట వివాహం అయిన 90 నిమిషాల తర్వాత విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గ్రేటర్ మాంచెస్టర్‌లోని స్టాక్‌పోర్ట్ రిజిస్టర్ ఆఫీస్‌లో స్కాట్ మెక్కీ, విక్టోరియా ఆండర్సన్ జంట భార్యాభర్తలుగా ప్రకటించిన గంట తర్వాత బంధాన్ని ముగించుకున్నారు.