మరికొన్ని గంటల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌పై అన్ని వర్గాల వారు ఆశలు పెట్టుకున్నారు. ప్రాముఖ్యంగా సీనియర్ సిటిజన్లు భారీగా ఆశలు పెట్టుకున్నారు. కరోనాకు ముందు రైల్వేలో రాయితీ సౌకర్యం ఉండేది. కోవిడ్ తర్వాత దాన్ని కేంద్రం ఎత్తివేసింది. దీంతో అందరితో పాటు సమానంగా టికెట్ తీసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇది కూడా చదవండి: Medchal: మేడ్చల్లో గుర్తుతెలియని మహిళ పుర్రె లభ్యం..
అయితే మోడీ 3.0 సర్కార్ ఏర్పడిన తర్వాత తొలిసారి మంగళవారం కేంద్రం 2024-25 బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. ఈ బడ్జెట్‌పై సామాన్యుల దగ్గర నుంచి అన్ని వర్గాల ప్రజలు చాలా ఆశలనే పెట్టుకున్నారు. గత కొంతకాలంలో రైల్వే రాయితీలు ఎత్తేశారు. అయితే ఈ బడ్జెట్‌లో మరోసారి సీనియర్ సిటిజన్స్‌ను రాయితీలు పునరుద్ధరించవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Sangameshwara temple: సంగమేశ్వరం గర్భాలయాన్ని తాకిన కృష్ణమ్మ.. చీర సారె సమర్పించి, మంగళ హారతి..
అంతకుముందు దేశంలోని పురుష సీనియర్ సిటిజన్లు, మహిళా సీనియర్ సిటిజన్లకు రైలు టిక్కెట్లపై భారీ రాయితీ లభించేది. మహిళా సీనియర్ సిటిజన్లకు రైలు టిక్కెట్లపై 50 శాతం రాయితీ లభించగా.. పురుషులు, ట్రాన్స్‌జెండర్ సీనియర్ సిటిజన్లకు 40 శాతం రాయితీ ఉండేది. రాజధాని, శతాబ్ది సేవలతో సహా అన్ని ఎక్స్‌ప్రెస్, మెయిన్ రైళ్లకు కూడా ఈ తగ్గింపు వర్తించేది. కాగా రాయితీ రద్దయినప్పటి నుంచి సీనియర్ సిటిజన్లు రైలు ప్రయాణాలకు ఇతర ప్రయాణికులతో సమానంగా పూర్తి ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. రైల్వే శాఖ నిబంధనల ప్రకారం పురుషులు, లింగమార్పిడి వ్యక్తులకు 60 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు, మహిళలకు 58 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు సీనియర్ సిటిజన్లుగా అర్హులు.
ఇది కూడా చదవండి: Hyderabad Drugs: డ్రగ్స్కు హబ్గా మారుతున్న పేరు మోసిన కాలేజీలు..