సెలబ్రిటీ చెఫ్ కునాల్ కపూర్‌కు విడాకులు మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. కునాల్ కపూర్ భార్య ధర్మాసనాన్ని ఆశ్రయించడంతో సుప్రీం కోర్టు తాజాగా స్టే విధించింది. సెటిల్‌మెంట్‌కు గల అవకాశాలను అన్వేషించాలని బెంచ్ కేసును న్యాయస్థానం మధ్యవర్తిత్వ కేంద్రానికి రిఫర్ చేసింది. కునాల్ దంపతులకు గత ఏప్రిల్‌లో హైకోర్టు విడాకులు మంజూరు అయ్యాయి.
ఇది కూాడా చదవండి: Chandrababu: న్యాయ విద్యార్థి చికిత్సకు సీఎం రూ. 10 లక్షల సాయం.. ధన్యవాదాలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే
న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం సోమవారం విడాకులపై స్టే విధిస్తూ… సెటిల్‌మెంట్ అవకాశాలను అన్వేషించాలని మధ్యవర్తిత్వ కేంద్రానికి సుప్రీంకోర్టు రిఫర్ చేసింది. కపూర్ పట్ల భార్య క్రూరత్వానికి పాల్పడిందనే కారణంతోనే ఢిల్లీ హైకోర్టు గత ఏప్రిల్‌లో విడాకులు మంజూరు చేసింది. భర్త పట్ల భార్యకు ఉండాల్సిన ప్రవర్తన.. గౌరవం లేదని పేర్కొంది. జీవిత భాగస్వామి మరొకరి పట్ల ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉండడం కరెక్ట్ కాదని చెప్పింది.
ఇది కూాడా చదవండి: Vanitha: 43 ఏళ్ల వయసు.. ముగ్గురు పిల్లలు.. నాలుగో పెళ్లికి సిద్ధమైన హీరోయిన్!
ఈ జంట ఏప్రిల్ 2008లో వివాహం చేసుకున్నారు. వీరికి 2012లో ఒక కుమారుడు జన్మించాడు. కునాల్ కపూర్..
టెలివిజన్ షో ‘మాస్టర్‌చెఫ్ ఇండియా’లో న్యాయనిర్ణేతగా ఉన్నారు. కునాల్ కపూర్ విడాకులు సందర్భంగా తన పిటిషన్‌లో భార్య తన తల్లిదండ్రులను గౌరవించడం లేదని.. అలాగే తనను అవమానించిందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను కునాల్ భార్య ఖండించింది. కోర్టును తప్పుదోవ పట్టించేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆరోపించింది.
ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు సోమవారం నుంచి లోక్ అదాలత్ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా పలు కేసులను పరిష్కరిస్తున్నారు. దీన్ని పురస్కరించుకుని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్.. గతంలో జరిగిన ఒక సంఘటనను గుర్తుచేశారు. విడాకులు తీసుకోవడానికి వచ్చిన ఓ జంట.. తర్వాత చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుని కలిసి పోయారని గుర్తుచేశారు.
ఇది కూాడా చదవండి: Ayodhya Saryu River: అయోధ్య సరయూ నదిలో జనగామ జిల్లా యువతి గల్లంతు.. 24 గంటలు కావస్తున్నా..!