Kerala: కేరళలో వాహనదారులకు కొత్త రూల్స్.. ఇకపై ఇలా చేస్తే ఫైన్..!
- కేరళలో వాహనదారులకు కొత్త రూల్స్
- పిలియన్ రైడర్‌లతో సంభాషించడంపై నిషేధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రమాదాలను అరికట్టేందుకు కేరళ రాష్ట్రం సరికొత్త రూల్స్ అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై బైక్ ప్రయాణంలో వెనుక సీట్లో కూర్చొని ఉన్న వ్యక్తితో మాట్లాడినా నేరంగా పరిగణించాలని కొత్త నిబంధన అమల్లోకి తెచ్చింది. పరధ్యానాన్ని తగ్గించడానికి, ప్రమాదాలను నివారించడానికి ద్విచక్ర వాహనదారులు పిలియన్ రైడర్‌లతో సంభాషించడాన్ని కేరళ నిషేధించింది.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: “రాజ్యాంగానికి అతీతుడివి కాదు”.. రాహుల్ తీరుపై కేంద్రమంత్రుల ఆగ్రహం..
Also Read
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కేరళ ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకువచ్చింది. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగే కాదు.. ఒక్కోసారి ద్విచక్రవాహనంలో ప్రయాణించేటప్పుడు వెనుక కూర్చొన్న వ్యక్తితో చోదకుడు మాట్లాడటం కూడా ప్రమాదాలకు దారి తీస్తుందని భావించిన ప్రభుత్వం.. ఓ కొత్త నిబంధనను అమలులోకి తీసుకొచ్చింది. ఇకపై డ్రైవింగ్ సమయంలో వెనుక సీట్లో కూర్చొన్న వ్యక్తితో మాట్లాడడం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. ఈ నిబంధన అన్ని రకాల ద్విచక్ర వాహనాలకు వర్తిస్తుంది. ఒకవేళ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తారు. పదే పదే ఈ నేరం పునరావృతమైతే తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి: Off The Record: అసెంబ్లీ సాక్షిగా చేసిన ఎమ్మెల్యే ఆరోపణల్లో నిజమెంత?
కొత్త రూల్స్‌ను కచ్చితంగా అమలు చేయాలని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులకు ఆదేశాలు జారీ అయ్యాయి. వెనుక వ్యక్తితో మాట్లాడుతున్న రైడర్‌కు చలానాలు పంపనుంది. అయితే.. ఎంత మొత్తంలో జరిమానా విధిస్తారో మాత్రం తెలియలేదు. దీనిపై ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిబంధన బాగుందని కొందరు అభినందిస్తుంటే.. ఆంక్షలు మరీ కఠినంగా ఉన్నాయంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Borewell Incident: బోరుబావిలో పడిన 3 ఏళ్ల బాలిక.. పుట్టిన రోజు వేడుకలకు ముందే ఘటన..
తాజావార్తలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!