ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇతరులపై దాఖలు చేసిన సీబీఐ చార్జిషీట్‌ను ఆగస్టు 12న ఢిల్లీ కోర్టు పరిశీలించాలని నిర్ణయించింది. కేజ్రీవాల్‌తో పాటు మరో ఐదుగురు నిందితులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌ను ఆగస్టు 12వ తేదీకి పరిశీలించాలని రోస్ అవెన్యూ కోర్టు మంగళవారం నిర్ణయించింది.
ఇది కూడా చదవండి: Asaduddin Owaisi: బీజేపీపై మండిపడ్డ అసదుద్దీన్.. ఆ ప్రమాదాలకు ప్రభుత్వం తప్పిదం..!
లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన తీహార్ జైల్లో ఉంటున్నారు. పలుమార్లు బెయిల్ పిటిషన్లు వేసినా.. తిరస్కరణకు గురయ్యాయి. ఆ మధ్య ట్రయల్ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈడీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. దానిపై స్టే విధించింది. మరోసారి ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై దర్యాప్తు సంస్థల అభిప్రాయాన్ని న్యాయస్థానం కోరింది. మరోవైపు కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆప్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుట్ర చేసి జైల్లో చంపాలని కేంద్రం యోచిస్తోందని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: CM Stalin: కేరళ ప్రభుత్వానికి తమిళనాడు సీఎం సాయం.. రూ. 5 కోట్లు ప్రకటన