Chocolate: ప్రముఖ చాక్లెట్‌పై షాకింగ్ న్యూస్.. ఇకపై తినే ముందు జాగ్రత్త!
- చాక్లెట్ ప్రియులకు షాకింగ్ న్యూస్
- విష పదార్ధాలు గుర్తించిన అధ్యయన బృందం
- ఇకపై జాగ్రత్తగా ఉండాలని పరిశోధకుడు హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాక్లెట్ అంటే పిల్లల దగ్గర నుంచి అన్ని వయసుల వారు ఇష్టపడని వాళ్లు ఉండరు. అది కనిపిస్తే చాలు.. లాలాజలం ఊరిపోతుంది. అంతగా ఇష్టపడేవాళ్లుంటారు. కనీసం రోజుకు ఒకటైనా తినకుండా ఉండరు. అంతగా ఇష్టపడి తినే చాక్లెట్ గురించి తాజాగా ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ షాకింగ్ న్యూస్ తెలియాలంటే ఈ వార్త చదవండి.
ప్రముఖ కోకో ఉత్పత్తుల నుంచి తయారయ్యే ఆహారాల్లో సీసం, కాడ్మియం వంటి విషపూరిత భారీ లోహాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని తాజా అధ్యయనంలో తేలింది. ఈ మేరకు అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనంలో తేటతెల్లమైంది. డార్క్ చాక్లెట్‌తో సహా 72 కోకో ఆధారిత ఆహారాలను ఎనిమిది సంవత్సరాల పాటు పరిశోధకులు నిశితంగా పరిశీలించిన తర్వాత ఈ మర్మం బయటపడింది. ఈ ఉత్పత్తుల్లో 43 శాతం సీసం, 35 శాతం కాడ్మియం అధికంగా ఉన్నట్లు గుర్తించింది. ఇది గుండె.. ఇతర అవయవాలకు ప్రమాదమని తేల్చింది.
Also Read
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
కోకో ఉత్పత్తుల్లో విష పదార్థాలు గుర్తించినట్లుగా ప్రధాన పరిశోధకుడైన లీ ఫ్రేమ్ వెల్లడించారు. ఈయన జీడబ్ల్యూ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అండ్ హెల్త్ సైన్సెస్‌లో ఇంటిగ్రేటివ్ మెడిసిన్ డైరెక్టర్ మరియు క్లినికల్ రీసెర్చ్ అండ్ లీడర్‌షిప్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఆహార పదార్థాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఇటువంటి వాటి పట్ల దూరంగా ఉండాలని సూచించారు.
సీసం అధికంగా ఉండడంతో అధిక రక్తపోటు, మెదడు, మూత్రపిండాలు, పునరుత్పత్తి వ్యవస్థకు హాని కలిగించవచ్చని చెప్పారు. అంతేకాకుండా తలనొప్పి, కడుపు తిమ్మిరి, మలబద్ధకం, కండరాలు/కీళ్ల నొప్పి, నిద్రకు ఇబ్బంది, అలసట, చిరాకు, సెక్స్ డ్రైవ్ కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇక కాడ్మియం విషపూరితం కారణంగా చలి, జ్వరం, కండరాల నొప్పికి కారణమవుతుందన్నారు. అంతేకాకుండా దీర్ఘకాలిక ఎక్స్పోజర్ మూత్రపిండాలు, ఎముకలు, ఊపిరితిత్తుల వ్యాధికి దారి తీస్తుందని వెల్లడించారు.
తాజావార్తలు
-
India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
-
CM Revanth Reddy : దేశంలో మరో స్వతంత్ర పోరాటం తప్పదు
-
Pakistan Army Plane Crash: పాకిస్థాన్లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
-
Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
-
Coolpad Wide-Screen: రూ.13 వేలకే Coolpad వైడ్స్క్రీన్ ఫోన్? 16:10 డిస్‌ప్లే, Helio G99 చిప్సెట్తో రానుందా?
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!