దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం లాభాలతో ముగిసింది. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. అనంతరం స్వల్ప లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. సెబీ ఛైర్మన్ మాధబిపై హిండెన్‌బర్గ్ ఆరోపణల తర్వాత ఈ వారం నష్టాలను చవిచూసింది. మొత్తానికి రెండ్రోజుల వరుస నష్టాల తర్వాత లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ 149 పాయింట్లు లాభపడి 79, 105 దగ్గర ముగియగా.. నిఫ్టీ 4 పాయింట్లు లాభపడి 24, 143 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలస్తే రూ. 83.97 దగ్గర రికార్డ్ స్థాయిలో ముగిసింది.
ఇది కూడా చదవండి: Vijayawada Traffic: రేపు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ మార్గంలో వెళితే అంతే సంగతి..!
నిఫ్టీలో టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, బీపీసీఎల్ లాభాల్లో ఉండగా.. దివీస్ ల్యాబ్స్, హీరో మోటోకార్ప్, కోల్ ఇండియా, ఒఎన్‌జీసీ మరియు అల్ట్రాటెక్ సిమెంట్ నష్టపోయాయి. ఐటీ (1.5 శాతం పెరుగుదల) మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు క్షీణించాయి.
ఇది కూడా చదవండి: Vinesh Phogat Verdict: వినేశ్ ఫోగట్ రజత పతకంపై డబ్ల్యూఎఫ్ఐ బిగ్ న్యూస్..