సునామీ హెచ్చరికలతో జపనీయులు బెంబేలెత్తిపోతున్నారు. రెండ్రోజుల క్రితం 7.1తో భూకంపం సంభవించింది. దీంతో ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. కనీసం ఇంట్లో నుంచి కాలు బయటపెట్టడం లేదు. అంతగా భయాందోళన చెందుతున్నారు. అందరూ ఆన్‌లైన్ బుకింగ్‌లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో టోక్యోలో స్టోర్‌లు, షాపింగ్ మాల్స్, ఆయా షాపులు వెలవెలబోతున్నాయి. ఇంకొన్ని చోట్ల ఉద్యోగులు కూడా విధులకు రావడం లేదు. అంతగా ప్రజలు హడలెత్తిపోతున్నారు.
ఇది కూడా చదవండి: Vinod Kambli: దేవుడి దయతో అంత ఓకే.. వినోద్ కాంబ్లీ హెల్త్ అప్‌డేట్..
సునామీ హెచ్చరికల నేపథ్యంలో జనాలు బయటకు రాకపోవడంతో రోడ్లు కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇదిలా ఉంటే పలు స్టోరుల్లో హెచ్చరిక బోర్డులు కూడా పెట్టారు. హోర్డింగ్‌లకు దూరంగా ఉండాలని సూచించారు. దీంతో ఎవరూ షాపింగ్ మాల్స్‌కు రావడం లేదు. వ్యాపారాలు దెబ్బతినడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రోజువారీ కార్యక్రమాలు యథావిథిగా కొనసాగించవచ్చని వెల్లడించారు. ఇదిలా ఉంటే సునామీ హెచ్చరికల నేపథ్యంలో అందరూ ఆన్‌లైన్ బుకింగ్‌లు చేస్తున్నారని నిర్వాహకులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి: Kolkata doctor murder case: కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసు.. నిందితుడిని పట్టించిన ‘‘బ్లూటూత్’’