Kolkata: ట్రైనీ డాక్టర్ హత్య కేసులో నిందితుడికి 14 రోజుల పోలీస్ కస్టడీ
- ట్రైనీ డాక్టర్ హత్య కేసులో నిందితుడికి 14 రోజుల పోలీస్ కస్టడీ
- ఆస్పత్రి సెమీనార్ హాల్‌లో నగ్నంగా శవమై తేలిన డాక్టర్
- రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు.. నిరసనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి 14 రోజులు పోలీసు కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. బీఎన్ఎస్ సెక్షన్లు 64 (అత్యాచారం), 103 (హత్య) కింద అభియోగాలు నమోదయ్యాయి. నిందితుడిని శనివారం సీల్దా కోర్టు ముందు హాజరుపరిచారు. కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా.. 14 రోజులు పోలీసు రిమాండ్‌కు సిటీ కోర్టు అనుమతి ఇచ్చింది. హత్యాచారానికి సంబంధించి తదుపరి విచారణ నిమిత్తం ఆగస్టు 23 వరకు 14 రోజుల పోలీసు రిమాండ్‌కు అనుమతించాలన్న ప్రాసిక్యూషన్ అభ్యర్థనను న్యాయమూర్తి ఆమోదించారు.
కోల్‌కతా ఆర్‌జీ కేర్ మెడికల్ ఆస్పత్రిలో మహిళా ట్రైనీ డాక్టర్ హత్యాచారానికి గురైంది. అనంతరం ఈ వ్యవహారం పశ్చిమ బెంగాల్‌ను కుదిసింది. డాక్టర్లు, నర్సులు, విద్యార్థి సంఘాలు, విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. న్యాయం చేయాలని బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. తక్షణమే నిందితుల్ని శిక్షించకపోతే విధుల్ని బహిష్కరిస్తామని మెడికోలు హెచ్చరికలు జారీ చేశారు.
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
డాక్టర్ హత్య కేసు వ్యవహారంపై దుమారం చెలరేగడంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ట్రైనీ డాక్టర్ హత్య కేసులో అరెస్టయిన నిందితులను అవసరమైతే ఉరితీస్తామని ప్రకటించారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు పంపాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికారులకు ఆదేశించారు. ఇదిలా ఉంటే పోస్టుమార్టం రిపోర్టులో డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగినట్లుగా నివేదిక వచ్చింది. దీంతో మెడికోలు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో రోగులకు డాక్టర్లు ఇబ్బంది కలిగించొద్దని.. తక్షణమే విధుల్లో చేరాలని సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమైందని.. బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
గురువారం అర్ధరాత్రి సమయంలో సెమినార్ హాల్‌లో ట్రైనీ డాక్టర్ నిద్రించింది. శుక్రవారం తెల్లవారుజామున చూసే సమయానికి ఆమె నగ్నంగా శవమై పడి ఉండడాన్ని చూసి సహచరులు భయాందోళన చెందారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పోస్టుమార్టం రిపోర్టు..
ట్రైనీ డాక్టర్ హత్య కేసులో పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెపై అత్యాచారం జరిగినట్లుగా గుర్తించారు. అలాగే ఆమె ప్రైవేటు భాగాల నుంచి రక్తస్రావం అయినట్లుగా తేలింది. అలాగే ఇతర శరీర భాగాలపైన కూడా గాయాలు ఉన్నట్లుగా నివేదికలో తేలింది. ఆమె రెండు కళ్లు, నోటి నుంచి రక్తస్రావం అయింది. ముఖం మీద గాయాలతో పాటు ఒక గోరును గుర్తించారు. అంతేకాకుండా ఆమె బొడ్డు, ఎడమ కాలు, మెడ, కుడి చేతి ఉంగరపు వేలికి గాయాలు గుర్తింపబడ్డాయి. ఇక పెదవులపై కూడా గాయాలు ఉన్నట్లుగా శవపరీక్షలో తేలింది. ఈ ఘటన తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల మధ్య జరిగి ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు కోల్‌కతా పోలీసులు క్రైమ్ విభాగం సభ్యులతో సహా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు.
ఇక అరెస్టయిన నిందితులకు ఆసుపత్రిలోని పలు విభాగాల్లో ఉచిత ప్రవేశం ఉందని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. ఇతని చర్యలు ప్రత్యక్షంగా ఉన్నట్లుగా తెలుస్తోందని పోలీస్ అధికారి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ హత్య కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ప్రస్తుతం కోల్‌కతాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు