Kangana ranaut: రాహుల్‌గాంధీపై కంగనా ఘాటు వ్యాఖ్యలు.. ప్రమాదకర వ్యక్తి అంటూ వ్యాఖ్య
- రాహుల్‌గాంధీపై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- ప్రమాదకర వ్యక్తి అంటూ వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ చాలా ప్రమాదకరమైన వ్యక్తిగా అభివర్ణించారు. ప్రధాని కాలేదన్న నిరాశలో దేశ ఆర్థిక పరిస్థితిని అస్థిరపరచడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. అమెరికా షార్ట్‌సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ నివేదికను ఆధారంగా చేసుకుని దేశీయ స్టాక్ మార్కెట్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగమైనవి కావన్నారు. ప్రజలు ఆయనను ఎప్పటికీ గెలిపించరని… ఎప్పటికీ ప్రతిపక్షంలోనే ఉంటారని ఎక్స్‌లో వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Punjab: ఇద్దరు యువకులపై ఏఎస్సై దురుసు ప్రవర్తన.. బూటు కాళ్లతో తన్నుతూ..
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
- Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
- CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
ఇదిలా ఉంటే హిండెన్‌బర్గ్ నివేదికపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. సెబీ పవిత్రత దెబ్బతిందని విమర్శించారు. ఛైర్‌పర్సన్ మాధవీ పురిపై వచ్చిన ఆరోపణలతో సెబీ పవిత్రత మసకబారిందని.. దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు ప్రస్తుతం ప్రభుత్వానికి మూడు ప్రశ్నలు వేస్తున్నారన్నారు. సెబీ ఛైర్‌పర్సన్ మాధవీ పురి ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదు? ఒకవేళ ఇన్వెస్టర్లు తాము కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోతే.. ఎవరు జవాబుదారీగా ఉంటారు? ప్రధాని మోడీనా? సెబీ ఛైర్‌పర్సనా? లేదా అదానీనా? ఈ అంశాన్ని సుప్రీంకోర్టు మరోసారి సుమోటోగా పరిశీలిస్తుందా? అని ‘ఎక్స్’ వేదికగా ప్రతిపక్ష నేత ప్రశ్నలు సంధించారు.
ఇది కూడా చదవండి: Steel Prices: భారీగా తగ్గిన స్టీల్ ధరలు.. మూడేళ్ల కనిష్ట స్థాయికి..!
అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురి అవకతవకలకు పాల్పడ్డారని, అలాగే మారిషస్ ఫండ్స్‌లో మాధబి పురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని ఇటీవల అమెరికా షార్ట్‌సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ తాజాగా ఆరోపించింది. ఈ ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే ఈ ఆరోపణలను మాధబి పురి ఖండించారు. తమ ఆర్థిక రికార్డులను బహిర్గతం చేస్తామని వెల్లడించారు.

తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!