కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం కేసు వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆస్పత్రి ఉన్నతాధికారుల నిర్లక్ష్యం బాధ్యతలేనట్టుగా కనిపిస్తున్నాయి. వైద్యురాలు అత్యంత దారుణంగా.. అత్యాచారానికి గురై, హత్య చేయబడి అర్ధనగ్నంగా శవమై పడి ఉంటే ఆర్జీ కర్ హాస్పిటల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్‌కు మాత్రం విచిత్రంగా అర్ధమైంది.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఆయా రాష్ట్రాల్లో వైద్యులు, నర్సులు విధులు బహిష్కరించి ఆందోళనలు చేపడుతున్నారు. ఇక కోల్‌కతాలో ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా సేవలు బంద్ చేసి వైద్యులు, నర్సులు ఆందోళనకు దిగారు.
వయనాడ్ విలయం ఇంకా కళ్ల ముందు మెదలాడుతూనే ఉంది. విపత్తు కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వందిలాది మంది గల్లంతయ్యారు. ఇంకొందరు క్షతగాత్రులయ్యారు. ఆప్తులను కోల్పోయిన బాధితుల ఎంతో మంది ఉన్నారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మధ్యంతర ప్రభుత్వం నుంచి సోమవారం పిలుపు వచ్చింది. బంగ్లాదేశ్‌కు తిరిగి రావాలని సందేశం పంపించారు. అయితే ప్రజలు ఆగ్రహానికి గురయ్యేలా ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేసింది.
పాకిస్థాన్ మాజీ ఐఎస్ఐ చీఫ్ ఫైజ్ హమీద్‌ను ఆర్మీ అరెస్ట్ చేసింది. హౌసింగ్ స్కీమ్ కుంభకోణానికి సంబంధించి కేసులో ఫైజ్ హమీద్‌ను కోర్టు మార్షల్‌కు ముందే సైన్యం అరెస్టు చేసినట్లు ఆర్మీ సోమవారం తెలిపింది.
దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో రాబోయే ఏడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల జాబితాను ఐఎండీ విడుదల చేసింది.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. హత్యాచారానికి గురైన తీరు మనసులను కలిచివేస్తోంది. ఇప్పటికే వైద్యులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనాకు రాసిన లేఖ దుమారం రేపుతోంది. ఈ వ్యవహారాన్ని తీహార్ జైలు అధికారులు తీవ్రంగా పరిగణించారు. జైలు నిబంంధనలు ఉల్లంఘించడమేనని అధికారులు హెచ్చరిస్తున్నారు.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం కేసు వ్యవహారం దేశాన్ని కుదిపిస్తోంది. సభ్య సమాజం తలదించుకునేలా అత్యంత దారుణంగా ఆమె హత్యాచారానికి గురైంది. ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలో వెలడైన విషయాలతో గుండెలు తరుక్కుపోతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్‌పై అమెరికా షార్ట్‌సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ నివేదిక తీవ్ర ప్రభావం పడింది. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్ మాత్రం నష్టాలతో ప్రారంభమై.. ఫ్లాట్‌గా ముగిశాయి.