యూకేకు బయల్దేరి వెళ్లిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో తిరిగి ముంబైలో అత్యవసర ల్యాండింగ్ అయింది. అయితే ప్రయాణికులకు పూర్తిగా నగదు వాపస్ చేయనున్నట్లు ఎయిరిండియా వెల్లడించింది.
ఇది కూడా చదవండి: INDIA Alliance: మోడీని ప్రశ్నించే గొంతు ఇప్పుడెందు లేవదు.. “కోల్‌కతా వైద్యురాలి” ఘటనపై ఇండియా కూటమి మౌనం..
బుధవారం ముంబై నుంచి లండన్‌కు ఎయిరిండియా విమానం బయలుదేరింది. అయితే ఆకాశంలో ఉండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్ అప్రమత్తమై తిరిగి విమానాన్ని ముంబైకి తీసుకొచ్చి సేఫ్‌గా ల్యాండింగ్ చేశారు. ముందు జాగ్రత్తల్లో భాగంగా తనిఖీల కోసం అది సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ప్రయాణీకులకు నగదు పూర్తిగా చెల్లిస్తున్నట్లు పేర్కొంది.
ఇది కూడా చదవండి: Train ticket: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై క్యూఆర్ కోడ్‌తో పేమెంట్స్