Bihar: బీహార్‌లో దారుణం.. ఐదుగురు కుటుంబ సభ్యులు హత్య
- బీహార్‌లో దారుణం
- ఐదుగురు కుటుంబ సభ్యులు హత్య
- సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు. ఈ ఘటన భాగల్‌పూర్‌లోని ప్రభుత్వ క్వార్టర్‌లో చోటుచేసుకుంది. ఒకేసారి ఐదుగురు హత్యకు గురికావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
బీహార్ భాగల్‌పూర్‌లోని ప్రభుత్వ క్వార్టర్‌లో ఒక మహిళా పోలీస్ కుటుంబం నివాసం ఉంటుంది. మహిళా పోలీస్ నీతూ కుమారి, భర్త పంకజ్, పిల్లలు శివాంశ్ (నాలుగున్నరేళ్లు), శ్రేయ (మూడున్నరేళ్లు), నీతు అత్తగారు ఆశాదేవి (65) నివాసం ఉంటున్నారు. అయితే నీతూ కుమారి తన పిల్లలను, అత్త గారును చంపేసింది. దీంతో కోపోద్రేకుడైన పంకజ్.. నీతూ కుమారి పీకకోసి చంపేశాడు. అనంతరం ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు పంకజ్ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. నీతూ కుమారికి అక్రమ సంబంధం ఉందని పంకజ్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అక్కడే ఉన్న సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నీతూ కుమారి అక్రమ సంబంధం పెట్టుకుందని పంకజ్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె పిల్లలను, తల్లిని చంపేసిందని.. ఆ కోపంతో భార్యను చంపినట్లుగా పంకజ్ నోట్‌లో తెలిపాడు. ఒకేసారి ఐదుగురు మృత్యువాత పడడంతో బంధువుల తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
चंद मिनटों में बिछ गई 5 लाशें…
महिला सिपाही ने सास व 2 बच्चो की जान ली.. गुस्से में पति ने पत्नि का मर्डर कर सुसाइड कर लिया
बिहार के भागलपुर में महिला सिपाही नीतू कुमारी और उसके दो छोटे बच्चों सहित चार लोगों की हत्या कर दी गई। इसके बाद पति ने खुदकुशी कर ली।मृतक पंकज ने एक… pic.twitter.com/vx69bGjZ6D
— TRUE STORY (@TrueStoryUP) August 14, 2024
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!