PM Modi: ప్రధాని మోడీ సరికొత్త పంథా.. ఉక్రెయిన్‌కు ఎలా వెళ్లనున్నారంటే…!
- ప్రధాని మోడీ సరికొత్త పంథా
- రైల్లో ఉక్రెయిన్‌కు వెళ్లనున్నట్లు సమాచారం
- పోలాండ్.. ఉక్రెయిన్‌లో పర్యటించనున్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ మరోసారి విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. రేపటి నుంచి మూడ్రోజుల పాటు పోలాండ్, ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. అయితే ఈసారి ప్రధాని మోడీ సరికొత్త పంథాను ఎంచుకున్నారు. విమానాల్లో కాకుండా ఉక్రెయిన్‌కు రైల్లో ప్రయాణం చేసి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 10 గంటల పాటు ట్రైన్‌లో ప్రయాణం చేయనున్నారు. ఇలా వెళ్లేటప్పుడు.. వచ్చేటప్పుడు మొత్తం 20 గంటలు ప్రయాణం చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Bihar: పామును నోటితో కరిచి చంపేసిన చిన్నారి.. వైద్యుల దగ్గరకు తీసుకెళ్తే..!
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
ప్రధాని మోడీ ఆగస్టు 21, 22 తేదీల్లో పోలాండ్‌లో పర్యటించనున్నారు. 22వ తారీఖున పోలాండ్ సరిహద్దులో నుంచి రైలు మార్గం గుండా విలాసవంతమైన ట్రైనులో ప్రయాణిస్తూ ఉక్రెయిన్ చేరుకోనున్నారు. ఆగస్టు 23న ఉక్రెయిన్ చేరుకున్న తర్వాత అక్కడ 7 గంటల పాటు పర్యటించనున్నారు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్-రష్యా యుద్ధం తర్వాత ప్రధాని మోడీ ఉక్రెయిన్‌లో పర్యటించడంతో ప్రధాన్యత సంతరించుకుంది. గత 30 ఏళ్లలో భారత ప్రధాని ఉక్రెయిన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.
ఇది కూడా చదవండి: Kolkata Doctor Murder Case: “నాన్న.. తిని మందులు వేసుకుని పడుకో”.. బాధితురాలి చివరి కాల్
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీతో ప్రధాని మోడీ చర్చలు జరుపుతారు. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలపై చర్చించనున్నారు. ఏడు గంటల పాటు గడిపిన తర్వాత తిరుగు ప్రయాణంలోనూ మోడీ రైలు ద్వారానే పోలాండ్‌కు వస్తారు. ఇలా మూడు రోజుల పర్యటన ముగించుకుని మోడీ భారత్‌కు రానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సహా పలువురు నేతలు ఉక్రెయిన్ పర్యటించినప్పుడు రైలు మార్గాన్నే ఎంచుకోవడం విశేషం. మొత్తానికి మోడీ వెళ్లేటప్పుడు 10 గంటలు.. వచ్చేటప్పుడు మరో 10 గంటల పాటు రైల్లో ప్రయాణం చేయనున్నారు.
ఇక మోడీ ప్రయాణించే రైల్లో విలాసవంతమైన క్యాబిన్లు ఉంటాయి. సమావేశాల కోసం పెద్ద పెద్ద టేబుల్స్, సోఫా, టీవీతో పాటు విశ్రాంతి తీసుకునేందుకు సౌకర్యవంతమైన పడక గది ఉంటుంది. వీటి భద్రత కూడా అదే స్థాయిలో ఉండేలా ఉక్రెయిన్ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రష్యాతో యుద్ధం నేపథ్యంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోనున్నారు.
ఇది కూడా చదవండి: Tesla Job Offer: బంపర్ ఆఫర్.. 7గంటల పనికి రూ.28,000!..అర్హతలివే..
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!