ఒలింపిక్స్ విజేత మను భాకర్ డ్యాన్స్‌తో సందడి చేశారు. స్కూల్‌లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా విద్యార్థినులతో కలిసి స్టేజ్‌పై డ్యాన్స్ చేసింది. కాలా చష్మా పాటపై మను భాకర్ ఒక కాలు కదిపింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Oldest woman in the world: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ.. ఆమె జీవిత రహస్యాలు ఇవే..
పాఠశాలలో మను భాకర్‌కు సత్కారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో ఆమె తన తల్లితో కలిసి హాజరైంది. ఈ సందర్భంగా కాలా చష్మా సాంగ్ ఫ్లే అవుతుండగా విద్యార్థినులతో కలిసి డ్యాన్స్ చేసింది. వెనుక కూర్చున్న తల్లి చప్పట్లతో ప్రోత్సహించింది. అలాగే స్టేజ్ కింద ఉన్న ప్రేక్షకులు కూడా మొబైల్‌లో చిత్రీకరించారు.
ఇది కూడా చదవండి: AP CM Chandrababu: గ్రామాల్లో మళ్లీ అభివృద్ధి వెలుగులు.. వచ్చే జనవరి నుంచి జన్మభూమి 2.0..
పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో మను భాకర్ రెండు పతకాలు సాధించింది. సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి పతకాలు సాధించింది. మను భాకర్.. పారిస్ నుంచి భారత్ చేరుకున్నాక.. అన్ని రాజకీయ పార్టీల నేతలను కలిసి పతకాలు చూపించింది. ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, సోనియా గాంధీని కలిసి ఒలింపిక్స్ విశేషాలు పంచుకుంది.
ఇది కూడా చదవండి: Kolkata Doctor Murder Case: “నాన్న.. తిని మందులు వేసుకుని పడుకో”.. బాధితురాలి చివరి కాల్
https://twitter.com/randhirmishra96/status/1825848600888295870