విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇరుక్కున్న బోట్లు వెలికితీసేందుకు అధికారులు, బేకం సంస్థ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా.. ఆటంకాలు ఎదురవుతున్నాయని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మంగళవారం ప్రకాశం బ్యారేజ్‌లో బోట్ల తొలగింపు పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇది కూడా చదవండి: UP News: 12 ఏళ్ల బాలికపై మదర్సా టీచర్ అత్యాచారం.. బందీగా ఉంచి అఘాయిత్యం..
బోట్లు ఒక్కొక్కటిగా కాకుండా మూడు బోట్లు కలిపి లింక్ ఉండటంతో బయటకు తీయడంలో సమస్యలు వస్తున్నాయని మంత్రి నిమ్మల చెప్పారు. 40 టన్నులు ఉన్న ఒక్కొక్క బోటును మూడు బోట్లుగా కలిపి 120 టన్నుల కెపాసిటీకి పెంచి ప్రకాశం బ్యారేజ్‌కి పంపడం దుర్మార్గం అని ధ్వజమెత్తారు. బోట్లు కౌంటర్ వెయిట్స్‌ను కాకుండా కట్టడాలను తాకి ఉంటే 3 జిల్లాలు బంగాళాఖాతంలో కలిసిపోయేవి అన్నారు. బ్యారేజ్, ప్రజల భద్రత దృష్ట్యా బోట్లను బయటకు తీసేందుకు విశాఖ నుంచి ప్రత్యేక టీమ్‌లు వస్తున్నాయని తెలిపారు. అలాగే 120 టన్నుల ఎయిర్ బెలూన్స్ కూడా తీసుకొస్తున్నారని చెప్పారు.
ఇది కూడా చదవండి: Koneti Adimulam: హైకోర్టులో టీడీపీ బహిష్కృత నేత పిటిషన్.. లైంగిక వేధింపుల కేసు కొట్టేయాలని వినతి
అత్యధిక వరద సమయంలో కూడా కోటి యాభై లక్షల విలువ చేసే బోట్లను లంగరు వేసుకోలేదంటేనే ఉద్దేశ్య పూర్వకంగా కుట్ర జరిగిందని అర్థం అవుతుందన్నారు. నేరస్తులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి హెచ్చరించారు. ప్రకాశం బ్యారేజ్ మీద రాకపోకలకు ప్రజలకు ఇబ్బంది లేకుండా త్వరగా పనులు చేయాలని నారా లోకేష్ సూచించారన్నారు. బుధవారం సాయంత్రానికి బోట్లు తొలగించే ప్రయత్నం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Devara Trailer: మీ రియాక్షన్స్ అన్నీ విన్నా.. దేవర ట్రైలర్ పై ఎన్టీఆర్ కామెంట్స్!!