చండీగఢ్‌లో పట్టపగలు ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. గ్రెనేడ్ దాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు జరగగానే కొందరు ఆటోలో పారిపోగా.. ఇంకొరు పరుగెత్తుకుంటూ వస్తున్న వ్యక్తి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. నగరంలోని ఉన్నత స్థాయి సెక్టార్ 10 ప్రాంతంలో జరిగిన పేలుడుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. దీని వెనుక ఉన్న వ్యక్తులు ఆటోలో వచ్చినట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. తెల్లటి టీ-షర్టు ధరించిన ఒక వ్యక్తి పరిగెత్తడం కనిపించింది.
పేలుడు జరగగానే అక్కడ నుంచి అతి వేగంగా ఆటోలో అనుమానితుడు పారిపోయాడు. ఆటో కుడివైపు మలుపు తీసుకుంటుండగా.. అప్పుడే ఒక కారు వచ్చింది. తృటిలో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న చండీగఢ్ పోలీసులు, ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంటి యజమానిని నిందితులు బెదిరిస్తున్నట్లుగా గుర్తించారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ), కేంద్ర ఉగ్రవాద నిరోధక చట్టం అమలు సంస్థ ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
రిటైర్డ్ పంజాబ్ పోలీసు అధికారి ఈ ఇంట్లో నివసిస్తున్నారు. అతన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో అతను ఇంటి వెలుపల విందు నిర్వహిస్తున్నప్పుడు ఒక అనుమానితుడు అరెస్టు చేశారు. పేలుడు జరగగానే పెద్ద శబ్దం వచ్చిందని చండీగఢ్ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ కన్వర్దీప్ కౌర్ తెలిపారు. తీవ్రత తక్కువగా ఉండడంతో కిటికీలు దెబ్బతిన్నట్లు చెప్పారు. బాధితులు ఇంటి వరండాలో కూర్చుని ఉండగా అనుమానితులు చూశారన్నారు. నిందితుల కోసం వేట కొనసాగుతుందని వెల్లడించారు.
Suspected grenade attack in Chandigarh, Sector 10 house.
Reportedly, CCTV footage of the explosion, which took place in the upscale Sector 10 area of the city, indicates that the people behind it arrived in an auto. A man in a white t-shirt is seen running and a second later, an… pic.twitter.com/gxt6N0GDiE— Payal Mohindra (@payal_mohindra) September 11, 2024