Malayalam: మలయాళ నటి కవియూర్ పొన్నమ్మ కన్నుమూత
- మలయాళ నటి కవియూర్ పొన్నమ్మ కన్నుమూత
- సంతాపం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి పినరయి విజయన్ శనివారం అంత్యక్రియలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ నటి కవియూర్ పొన్నమ్మ (79) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె మృతిచెందారు.ఆరు దశాబ్దాలకు పైగా విశిష్టమైన కెరీర్‌ను కొనసాగించింది. కొన్ని నెలలుగా వయోభారంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరింది. పొన్నమ్మ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
‘‘తల్లి పాత్రల ద్వారా మలయాళీల హృదయాలను గెలుచుకున్న కవియూర్ పొన్నమ్మ మృతి పట్ల నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఆమె సుదీర్ఘ కళాత్మక జీవితం ఒక్క సినిమాకే పరిమితం కాకుండా థియేటర్ మరియు టెలివిజన్‌కు కూడా విస్తరించింది.’’ అని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.
Also Read
‘‘ఆమె మరణంతో మలయాళ సినిమా, థియేటర్ చరిత్రలో ఒక విశిష్టమైన అధ్యాయం ముగిసింది. ఆమె తన చిరస్మరణీయ పాత్రల ద్వారా మలయాళీల హృదయాల్లో నిలిచిపోతుంది. ఆమె కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను.’’ అని కవియూర్ పొన్నమ్మ మృతి పట్ల సాంస్కృతిక శాఖ మంత్రి సాజి చెరియన్ కూడా సంతాపం తెలిపారు.
రేపు కవియూర్ పొన్నమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. కలమస్సేరి మునిసిపల్ టౌన్ హాల్లో ప్రజల సందర్శన ఉంచనున్నారు. గాయనిగా కెరీర్ ప్రారంభించి… నాటకరంగంలోకి మారిన పొన్నమ్మ దాదాపు వెయ్యి సినిమాల్లో నటించింది. ఐకానిక్ తల్లి పాత్రల ద్వారా మలయాళీల హృదయాలను గెలుచుకున్నారు. తల్లి పాత్రలతో పాటు ప్రతికూల పాత్రలతో సహా విభిన్న పాత్రలను పోషించింది. మేఘతీర్థం చిత్రాన్ని కూడా నిర్మించారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Koti Deepotsavam 2026 : కార్తీక సోమవారం.. కోటి దీపోత్సవంలో ఏకామ్రేశ్వరస్వామి కల్యాణ శోభ
-
Gas Stove Knob Cleaning Tips : గ్యాస్ స్టవ్ నాబ్లపై జిడ్డు మరకలా?.. ఈ సింపుల్ ట్రిక్‌తో మాయం!
-
Stock Market: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ..
-
Shruti Hasan : డ్రెస్సింగ్ వివాదం.. జాన్వీ కపూర్‌కు, యాంకర్‌కు ఒకే దెబ్బతో శృతి హాసన్ స్లిప్పర్ షాట్!
-
Gold Man: ‘గోల్డ్ మ్యాన్’ కేసులో ఐటీ శాఖ దూకుడు.. రాయదుర్గంలో బినామీ భవనం అటాచ్
ట్రెండింగ్
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్‌బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!