కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి. న్యాయం చేయాలంటూ వైద్యులు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆర్‌జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు సీబీఐ కోర్టు షాకిచ్చింది. హత్యాచారానికి సంబంధించి సాక్ష్యాలు నాశనం చేసిన కేసులో సందీప్ ఘోష్‌కు సీబీఐ కస్టడీని సెప్టెంబర్ 25 దాకా కోర్టు పొడిగించింది. ఘోష్‌తో పాటు ఇదే కేసులో ఇప్పటికే అరెస్టయిన కోల్‌కతా తాలా పోలీస్‌స్టేషన్ సీఐ అభిజిత్ మండల్‌ను కూడా సెప్టెంబర్ 25 దాకా సీబీఐ కస్టడీకి ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Hezbollah: ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో హిజ్బుల్లా కీలక కమాండర్ ఇబ్రహీం అకిల్ హతం..
హత్యాచారం వెనుక ప్రధాన నిందితుడు సంజయ్‌రాయ్‌తో కలిసి ఘోష్, మండల్ ఏదైనా కుట్ర చేశారా అని సీబీఐ అనుమానిస్తోంది. దీంతో వీరిద్దరి కస్టడీని పొడిగించాలని కోరగా కోర్టు అనుమతిచ్చింది. కుట్ర కోణంలో సీబీఐ వీరిని విచారించనుంది. అలాగే మెడికల్ కాలేజీలో ఆర్థిక అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఘోష్ మెడికల్ లైసెన్స్‌ను ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది.
ఇది కూడా చదవండి: Rishikesh station: రైల్వేస్టేషన్ ఫ్లాట్‌ఫామ్‌పై పాము హల్‌చల్.. ప్రయాణికులు పరుగులు
ఆగస్టు 9న ఆర్ జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలు అత్యంత క్రూరంగా హత్యాచారానికి గురైంది. అనంతరం దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. న్యాయం చేయాలని డాక్టర్లు గొంతెత్తారు. ఇక ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. అలాగే సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేస్తోంది. మరోవైపు వైద్యులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. వైద్యులు.. విధుల్లో చేరాలని కోరుతోంది.
ఇది కూడా చదవండి: Original Ghee Test: మీరు తినే నెయ్యి.. మంచిదేనా? జంతువుల కొవ్వా? తెలుసుకోండిలా…