Mumbai Rain: ముంబైకి రెడ్ అలర్ట్ జారీ.. విద్యాసంస్థలు బంద్
- ముంబైకి రెడ్ అలర్ట్ జారీ
- గురువారం విద్యాసంస్థలు బంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థిక రాజధాని ముంబైను కుండపోత వర్షం ముంచెత్తింది. బుధవారం సాయంత్రం కురిసిన వర్షంతో నగరం అతలాకుతలం అయిపోయింది. విద్యార్థులు, ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయంలో అత్యంత భారీ వర్షం కురవడంతో జనాలకు చుక్కలు కనిపించాయి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిపోయాయి. ఇక రైళ్లు, బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. మరోవైపు రహదారులపై పెద్ద ఎత్తున నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాజాగా కేంద్ర వాతావరణ శాఖ ముంబైకి రెడ్డ అలర్ట్ జారీ చేసింది. రాబోయే కొన్ని గంటల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో గురువారం విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
ఇది కూడా చదవండి: US Election: ముందంజలో దూసుకెళ్తోన్న కమలాహారిస్.. తాజా సర్వేలో ఎన్ని ఓట్లు వచ్చాయంటే..!
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. స్పైస్‌జెట్ మరియు విస్తారా కొన్ని విమానాలను దారి మళ్లించినట్లు ఎక్స్‌లో పేర్కొన్నాయి. ముంబై విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణం కారణంగా హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లే విమానం నంబర్ UK534 హైదరాబాద్‌కు తిరిగి వస్తోందని, రాత్రి 9.15 గంటలకు హైదరాబాద్‌లో ల్యాండ్ అవుతుందని విస్తారా తెలిపింది. ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లాల్సిన మరో విమానం UK941 హైదరాబాద్‌కు మళ్లించబడింది. రాత్రి 9.10 గంటలకు వచ్చే అవకాశం ఉంది. ప్రయాణీకులు తమ విమాన స్థితిని తనిఖీ చేసుకోవాలని ‘స్పైస్‌జెట్’ ఎక్స్‌లో విజ్ఞప్తి చేసింది.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి పవన్‌కు వైద్యుల విజ్ఞప్తి
ముంబై మరియు పొరుగు జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలె జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గురువారం ఉదయం వరకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ముంబైలోని పలు శివారు ప్రాంతాలలో బుధవారం మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తోంది. ములుండ్ మరియు దాని పరిసరాల్లో భారీ వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ముంబై, థానే, రాయ్‌గఢ్, రత్నగిరి జిల్లాల్లో విపరీతమైన భారీ వర్షాలు మరియు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది.
ఉత్తర కొంకణ్ నుంచి దక్షిణ బంగ్లాదేశ్ వరకు దక్షిణ ఛత్తీస్‌గఢ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో తుఫాను సర్క్యులేషన్ మీదుగా ఒక ద్రోణి నడుస్తుందని వాతావరణశాఖ తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముంబయి, పాల్ఘర్, నందుర్బార్, ధూలే, జల్గావ్, షోలాపూర్, సతారా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం, గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ శాఖ వెల్లడించింది.
Waterlogging started in Mulund & Bhandup ⚠️
More heavy rains to come for the rest of the day, Stay safe Mumbaikars! #MumbaiRainspic.twitter.com/bds25CEBM1 https://t.co/llmndVDLg4— Mumbai Rains (@rushikesh_agre_) September 25, 2024
Visibility at its worst!
Blinding Rains. Waterlogging on tracks soon! #MumbaiRains pic.twitter.com/u1yupPLFAv— Mumbai Nowcast (@s_r_khandelwal) September 25, 2024
Kalidas, Mulund West waterlogged @mybmcWardT people are stranded. Please help citizens and deploy officials. #Mumbai@mulund_info pic.twitter.com/TBKRi1pesN
— Ritu Satya-Rekha (@ritusharma9736) September 25, 2024
वांद्रे, बीकेसी हद्दीत दक्षिण व उत्तर वाहिनीवरील वाहतूक पावसामुळे संथ गतीने सुरु आहे.#MTPTtrafficUpdates
— Mumbai Traffic Police (@MTPHereToHelp) September 25, 2024
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!