రెస్టారెంట్, తినుబండారాల యజమానులు గుర్తింపును తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ హిమాచల్‌ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఆహార భద్రత, పరిశుభ్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ప్రకటనపై వ్యాపారుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో మంత్రి ప్రకటనను కాంగ్రెస్ పార్టీ మందలించింది. ఆ ప్రకటనపై యూటర్న్ తీసుకుంది. యజమానుల నేమ్ బోర్డు డిస్‌ప్లే, ఇతర గుర్తింపును గురించి ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇది కూడా చదవండి: Home Minister Anitha: ముంబయి నటి కేసు.. తప్పు చేసిన ఎవర్ని వదిలే ప్రసక్తే లేదు..
వీధి వ్యాపారుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం నిబద్ధతతో ఉందని ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. దీనిపై సమీక్షించడానికి కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హర్షవర్ధన్ చౌహాన్ అధ్యక్షతన జరిగిన ఈ కమిటీలో ఇరు పార్టీలకు చెందిన కీలక మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. దీనిపై వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించనుంది. ఈ ప్రాతిపాదనను కేబినెట్ ముందుకు కూడా తీసుకురానుంది.
ఇది కూడా చదవండి: Pakistan-Bangladesh: పాక్-బంగ్లాదేశ్ చెట్టాపట్టాల్.. “సార్క్” పునరుద్ధరణపై చర్చ..
ఇదిలా ఉంటే ఆ మధ్య ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇప్పుడు యోగి సర్కార్ మాదిరిగానే మంత్రి విక్రమాదిత్య సింగ్ కూడా.. హిమాచల్‌ప్రదేశ్‌లో ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆయన్ను కాంగ్రెస్ మందలించడంతో వెనక్కి తగ్గారు.
ఇది కూడా చదవండి: Devara : ఫాన్స్ కి షాక్.. అక్కడ 1 AM షోస్ క్యాన్సిల్.. ఎందుకంటే?