వన్ నేషన్-వన్ ఎలక్షన్‌పై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జమిలి ఎన్నికలు వద్దంటూ పినరయి విజయన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఒకే దేశం-ఒకే ఎన్నికలపై కేంద్రం ముందడుగు వేసింది. ఇటీవలే జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఇంతలోనే కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జమిలి ఎన్నికలు అప్రజాస్వామికమైనదని.. అంతేకాకుండా దేశ సమాఖ్య నిర్మాణానికి హానికరం అని తీర్మానం చేసింది.
ఇది కూడా చదవండి: Balakrishna: బాక్సులు బద్దలయ్యే న్యూస్.. ఇక రచ్చ రచ్చే!
జమిలి ఎన్నికలపై కేంద్రం ముందడుగు వేస్తుంటే.. కేరళ ప్రభుత్వం మాత్రం వెనకడుగు వేసింది. దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించే ఆలోచనను విరమించుకోవాలని కేరళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం కేరళ అసెంబ్లీలో సీఎం పినరయి విజయన్ ప్రభుత్వం తీర్మానం చేసింది. ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం అప్రజాస్వామికం, దేశ సమాఖ్య నిర్మాణానికి హానికరమని తీర్మానంలో పేర్కొంది.
ఇది కూడా చదవండి: Vizag Honey Trap Case: కిలాడీ లేడీ జాయ్ జేమిమ హనీట్రాప్ కేసులో కొత్త కోణాలు..
జమిలి ఎన్నికలను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బిల్లు ఆమోదం పొందాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందని.. అందుకు మోడీ ప్రభుత్వానికి మెజార్టీ లేదని కాంగ్రెస్ ఆరోపించింది. మరోవైపు జమిలి ఎన్నికలకు బీఎస్సీ అధినేత మాయావతి జై కొట్టారు. కొన్ని పార్టీలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. అయినా కూడా కేంద్రం మాత్రం ముందుకే దూసుకెళ్తోంది.
Kerala Legislative Assembly passed a resolution urging the central government to withdraw its proposed 'One Nation, One Election' reform, describing it as undemocratic and detrimental to the nation's federal structure.
— ANI (@ANI) October 10, 2024