Congress: హర్యానా ఫలితాలపై కాంగ్రెస్ కీలక నిర్ణయం
- హర్యానా ఫలితాలపై కాంగ్రెస్ కీలక నిర్ణయం
- ఈవీఎంలలో పరిశీలనకు సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి హస్తం పార్టీ నేతలు నిరాశ, నిస్పృహలతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ జిమ్మిక్కులు చేసి హర్యానాలో గెలిచిందని కాంగ్రెస్ ఆరోపించింది. అంతేకాకుండా బుధవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసింది. విచారణ జరపాలని కోరింది. తాజాగా ఇదే అంశంపై కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపుపై పార్టీ అభ్యర్థుల ఫిర్యాదులు, ఈవీఎంలలో వ్యత్యాసాలను పరిశీలించేందుకు సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.
విచారణ పూర్తయ్యే వరకు ఈవీఎంలకు సీలు వేసి భద్రపరచాలని పార్టీ నేతలు ఈసీని కోరారు. మాజీ ముఖ్యమంత్రులు భూపిందర్ సింగ్ హుడా, అశోక్ గెహ్లాట్, అలాగే ఏఐసీసీ సభ్యులు కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, అజయ్ మాకెన్, పవన్ ఖేరాలతో కూడిన సీనియర్ నేతల బృందం, హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్, ఎన్నికల సంఘం ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు.
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
- Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
- CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
ఇది కూడా చదవండి: Ratan Tata family tree: రతన్ టాటా ‘‘వంశ వృక్షం’’ ఇదే.. ఎవరికి టాటా గ్రూప్ దక్కుతుంది..?
అక్టోబర్ 8న హర్యానా ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో కాంగ్రెస్ ముందంజలో దూసుకెళ్లింది. సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ అంతలోనే ఫలితాలు తారుమారు అయ్యాయి. బీజేపీ లీడ్‌లోకి వచ్చి విజయం దిశగా దూసుకెళ్లింది. ఫలితాలు ఒక్కసారిగా తలకిందులవ్వడంతో కాంగ్రెస్ షాక్‌కు గురైంది. 48 స్థానాలతో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఫలితాలను బలవంతంగా లాక్కుందని.. దీన్ని అంగీకరించబోమని కాంగ్రెస్ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Bangalore: దుకాణదారుడి భార్య ఖాతాలోకి హఠాత్తుగా రూ.999 కోట్లు.. తర్వాత ఏం జరిగింది?
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!