పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి నుంచి కీలక ప్రకటన వచ్చింది. చమురు కొరత లేదని.. ధరలు తగ్గే అవకాశం ఉందని వాహనదారులకు కేంద్రమంత్రి శుభవార్త చెప్పారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చమురు ధరలు అమాంతంగా పెరిగిపోతాయని.. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతాయని వార్తలు షికార్లు చేశారు. ఆ వదంతులకు హర్దీప్ సింగ్ పూరి ఫుల్‌స్టాప్ చెప్పారు.
ఇది కూడా చదవండి: ACB Raids: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పెబ్బేరు కమిషనర్..
బ్రెజిల్, గయానా వంటి దేశాలు తమ ఉత్పత్తిని పెంచుతున్నందున ప్రపంచంలో చమురు కొరత లేదని పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ప్రపంచంలో తగినంత కంటే ఎక్కువ చమురు ఉందన్నారు. ధరలు కూడా ఆశాజనకంగా తగ్గుతాయని కేంద్రమంత్రి గుడ్‌న్యూస్ చెప్పారు. ప్రస్తుత ధరల పెరుగుదలకు భౌగోళికంగా ఉన్న రాజకీయ ఉద్రిక్తత పరిస్థితులు ఒక కారణమని ఆయన అన్నారు.
ప్రపంచంలో తగినంత చమురు ఉందని.. దీని కారణంగా ధరలు తగ్గుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. గత మూడేళ్లుగా నిలకడగా ఉన్నాయని.. చమురు ధరలు స్థిరంగా ఉండేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు.
ఇది కూడా చదవండి: US Elections:170 ఏళ్లుగా అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు మంగళవారం మాత్రమే ఎందుకు జరుగుతున్నాయి?