దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఒడుదుడుకులు కొనసాగుతున్నాయి. గత వారం మాదిరిగానే వరుస నష్టాలను ఎదుర్కొంటోంది. ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోతుంది. అమెరికా ఎన్నికల అనిశ్చితి.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో మన మార్కెట్ వరుస నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. బుధవారం ఉదయం సూచీలు నష్టాలతో ప్రారంభమైనా.. కొద్దిసేపటికే స్వల్ప లాభాల్లోకి వచ్చాయి. తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 138 పాయింట్లు నష్టపోయి 80, 081 దగ్గర ముగియగా.. నిఫ్టీ 36 పాయింట్లు నష్టపోయి 24, 435 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ. 84.08 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Lover Suicide: పెళ్లి చేసుకోమని అడిగిన ప్రియురాలు.. చచ్చిపోమని పురుగుల మందు కొనిచ్చిన ప్రియుడు.. చివరకు?
నిఫ్టీలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్ టెక్, టాటా కన్స్యూమర్ లాభాల్లో కొనసాగగా.. ఎం అండ్ ఎం, సన్ ఫార్మా, ఎన్‌టీపీసీ, పవర్ గ్రిడ్ కార్ప్, శ్రీరామ్ ఫైనాన్స్ నష్టపోయాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం, స్మాల్ క్యాప్ సూచీలు 1 శాతం పెరిగాయి. సెక్టార్లలో ఐటీ ఇండెక్స్ 2 శాతానికి పైగా పెరగగా, క్యాపిటల్ గూడ్స్, పవర్, ఫార్మా 1 శాతం చొప్పున క్షీణించాయి.
ఇది కూడా చదవండి: Jammu Kashmir: విద్యార్థులకు దీపావళి గుడ్‌న్యూస్.. విద్యాసంస్థలకు 5 రోజులు సెలవులు