దేశ రాజధాని ఢిల్లీలో పావురాల రెట్టతో ప్రమాదం పొంచి ఉంది. దీంతో పావురాల ప్రభావిత కేంద్రాలపై నిషేధం విధించడానికి ఆప్ సర్కార్ యోచిస్తోంది. పావురాల రెట్టల కారణంగా ఆరోగ్యానికి హాని కలుగుతుందని ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ గుర్తించింది. దీంతో పావురాలకు ఆహారం ఇచ్చే ప్రదేశాలను నిషేధించాలని యోచిస్తోంది. పావురాలు ద్వారా సాల్మొనెల్లా, ఇ కోలి, ఇన్‌ఫ్లుఎంజా, హైపర్‌సెన్సిటివిటీ న్యుమోనైటిస్ వంటి ఇతర వ్యాధులకు పావురాల రెట్టలు కారణం అవుతున్నాయి. పావురాలకు కొన్ని కేంద్రాలు సంతానోత్పత్తి కేంద్రాలుగా మారుతున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలో అనవసరమైన ఆహారం కారణంగా పావురాల ఉత్పత్తి పెరిగిందని వైద్యుడు చెప్పారు. పిల్లలు, వృద్ధులు ప్రమాదానికి గురికాక ముందే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Ayodhya: అయోధ్యలో 25 లక్షలకు పైగా దీపాల అద్భుత దృశ్యం.. రెండు గిన్నిస్ రికార్డులు
బాలీవుడ్ సినిమాల్లో సల్మాన్‌ఖాన్, షారుక్ ఖాన్, అమ్రిష్ పూరి నటించిన సినిమాల్లో పావురాలకు ఆహారం తినిపించిన సన్నివేషాలు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో అప్పట్నుంచీ చాలా మంది పావురాలకు ఆహారం ఇవ్వడం ప్రారంభించారు. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల్లో మతపరమైన కారణాల వల్ల కూడా పావురాల అధిక జనాభాకు దారితీసింది.
ఇది కూడా చదవండి: Kandula Durgesh: బాణాసంచా తయారీ కేంద్రం వద్ద పిడుగు ధాటికి ఇద్దరు మృతి.. మంత్రి కీలక ఆదేశాలు
అయితే ఢిల్లీలో పావురాలకు ఆహారం ఇచ్చే ప్రదేశాలను గుర్తించి నిషేధం విధించాలని మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ యోచిస్తోంది. ఢిల్లీ అంతటా పావురాల కేంద్రాలు విస్తరించి ఉన్నాయి. చాందినీ చౌక్, మోరీ గేట్, కాశ్మీర్ గేట్‌లోని వాల్డ్ సిటీ ప్రాంతాల నుంచి పహర్‌గంజ్, జామా మసీదు, ఇండియా గేట్ వరకు విస్తరించి ఉన్నాయి. పావురాల రెట్టల కారణంగా ఉబ్బసం వంటి శ్వాసకోశ పరిస్థితులను మరింత తీవ్రతరం చేయవచ్చని వైద్యులు వార్నింగ్ ఇచ్చారు. ‘‘రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, పిల్లలు పలు రకాలైన వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ ఎకె పాత్ర చెప్పారు. పిల్లలు, వృద్ధులు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు మరియు అలెర్జీ చర్యలకు గురిచేస్తుంది. పైగా ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యంతో పాటు పావురాల రెట్టతో అలెర్జీలు, ఊపిరితిత్తుల సమస్యను పెంచుతాయని ఆయన హెచ్చరించారు. వైద్యుల సూచనతో పావురాల స్థావరాలపై నిషేధం విధించాలని ఢిల్లీ సర్కా్ర్ భావిస్తోంది.
ఇది కూడా చదవండి: Uddhav Thackeray: ‘‘మాతో ఉన్నప్పుడు చాలా సీట్లు ఇచ్చాం’’.. ఉద్ధవ్ పరిస్థితిపై బీజేపీ..