కుక్కల మారణహోమానికి మరో బాలుడు బలైపోయాడు. కుక్కల స్వైరవిహారానికి ప్రాణాలు పోతున్నా.. అధికారుల మాత్రం పట్టించుకోవడంలో లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఘోరం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కుక్కలు బీభత్సం సృష్టించాయి. కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడి ప్రాణాలు పోయాయి.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో తెలంగాణలో పత్తి కొనుగోళ్లకు ప్రతిష్టంభన తొలగింది. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లకు లైన్ క్లియరైంది. తెలంగాణలో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయిన నేపథ్యంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో కిషన్‌రెడ్డి మాట్లాడి పరిస్థితిని వివరించారు. రైతులను ఆదుకోవాలని కోరారు.
ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. అంతేకాని చావును కాదు. ప్రేమ ప్రదర్శింపబడుతుంది. అది ఏ రూపంలోనైనా?. అంతేతప్ప.. ఏ విధంగాను మరణాన్ని కోరుకోదు. అయితే ప్రియురాలిని తన నుంచి దూరం చేశారన్న కోపంతో ఓ ప్రియుడు మూర్ఖంగా ప్రవర్తించాడు. ఏకంగా ప్రియురాలి తండ్రిపై తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు.
హైనాన్ ఎయిర్‌లైన్స్‌కు పెనుప్రమాదం తప్పింది. ఆదివారం (నవంబర్ 10) హైనాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం HU438 ఇటలీలోని రోమ్ నుంచి చైనాలోని షెన్జెన్కు వెళ్తోంది. టేకాఫ్ సమయంలో కుడి ఇంజిన్‌పై పక్షి దాడి చేసింది.
రైతుకు ఎక్కడ కష్టం వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జాతీయ రహదారిపై మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడారు.
ఉద్యోగుల సంరక్షణ కోసం కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కింద ఉన్న ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితిని పెంచాలని కేంద్రం భావిస్తోంది.
అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్లో సంభాషించినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం ముగించాలంటూ పుతిన్‌కు ట్రంప్ సూచించినట్లు వార్తలు వచ్చాయి.
జపాన్‌కు చెందిన లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్డీపీ) నాయకుడు షిగేరు ఇషిబా జపాన్ డైట్‌లోని ఉభయ సభల్లో అత్యధిక ఓట్లు సాధించి దేశ ప్రధానమంత్రిగా తిరిగి సోమవారం ఎన్నికయ్యారు.
దేశీయ స్టాక్ మార్కె్ట్ ప్లాట్‌గా ముగిసింది. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు కారణంగా సోమవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా అలానే కొనసాగాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం సాధించిన తర్వాత మార్కెట్లు పంజుకుంటాయని అంతా భావించారు.
మేఘాలయలోని షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్శిటీ (ఎన్ఇహెచ్యూ) ఆందోళనలతో అట్టుడికింది. వైస్-ఛాన్సలర్, రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్లు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ విద్యార్థులు నిరాహారదీక్ష చేపట్టారు. ఈ ఆందోళనలు ఆదివారం తీవ్ర ఉద్రిక్తంగా మారాయి.