ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా నుంచి ఎలక్ట్రిక్ వాహనం ఎంట్రీ ఇవ్వబోతుంది. త్వరలో విద్యుత్ స్కూటర్‌ను లాంచ్ చేయబోతున్నట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించిన టీజర్‌ను తాజాగా విడుదల చేసింది.
వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నిక బుధవారం జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వయనాడ్ సహా 31 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. వయనాడ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇక్కడ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సోదరీ ప్రియాంకాగాంధీ పోటీ చేస్తున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ నోబెల్ శాంతి బహుమతికి అర్హులు అని మార్కెట్ వెటరన్ మార్క్ మోబియస్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా మోడీ పాత్ర ప్రాముఖ్యత సంతరించుకుంటుందని.. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలతో మోడీకి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
ప్రధాని మోడీ మరోసారి మూడు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. నవంబర్ 16-21 తేదీల్లో నైజీరియా, బ్రెజిల్, గయానాలో పర్యటించనున్నారు. గతనెల అక్టోబర్‌లో మోడీ రష్యాకు వెళ్లి వచ్చారు. బ్రిక్స్ సమావేశంలో పాల్గొన్నారు. మరోసారి ఒకేసారి మూడు దేశాల్లో పర్యటించనున్నారు. 17 సంవత్సరాల్లో భారత ప్రధాని నైజీరియాలో పర్యటించడం ఇదే తొలిసారి.
అమెరికాలో అబార్షన్ మందులకు భారీగా డిమాండ్ పెరిగింది. చాలామంది గర్భనిరోధకాలు, అబార్షన్ మాత్రలను ఆర్డర్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.
గాజా, లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు ఆపేందుకు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని ప్రపంచమంతా ఎదురుచూస్తోందని ఇరాన్ పేర్కొంది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు ఆదివారం డెలావేర్‌లోని ఇసుక బీచ్‌లో గడిపేందుకు వెళ్లారు. అయితే బైడెన్ ఇసుకలో నడిచేందుకు చాలా ఇబ్బందులు పడ్డారు. పలుమార్లు బైడెన్ తుళ్లిపడబోయారు.
ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPPSC) కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున నిరుద్యోగులు, ఆశావహులు ప్రయాగ్‌రాజ్‌లోని యూపీపీఎస్సీ కార్యాలయం ఎదుట మోహరించారు.
యాపిల్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హైఅలర్ట్ జారీ చేసింది. కంపెనీకి చెందిన ఐఫోన్స్, మ్యాక్స్, యాపిల్ వాచీలు ఉపయోగించేవారిని కేంద్రం అలర్ట్ చేసింది. యాపిల్ డివైజ్‌ల్లో పాత సాఫ్ట్‌వేర్‌లో అనేక భద్రతా లోపాలను హైలైట్ చేస్తూ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఒక ప్రకటన విడుదల చేసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లో వరుసగా రెండో రోజు ఒడుదొడుకులు కొనసాగాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం సాధించిన తర్వాత.. మార్కెట్‌కు కొత్త ఊపు సంతరించుకుంటుందని ఆర్థిక నిపుణులు భావించారు.