తల్లి, బిడ్డల బంధం ఎంత గొప్పదో మాటల్లో చెప్పలేనిది. పురుడుపోసుకుని బయటకు వచ్చిన శిశువుకు వెంటనే మురిపాలు తాగిస్తారు. ఈ పాలు బిడ్డకు ఎంతో ప్రయోజనకరం. శిశువు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే శిశువు బయటకు రాగానే వైద్యులు.. మురిపాలు పట్టించమని చెబుతుంటారు.
గాజాపై ఇజ్రాయెల్ జరిపిస్తున్న మారణహోమానికి ప్రతీకారంగానే అమ్‌స్టర్‌డామ్‌లో ఇజ్రాయెల్ పౌరులపై దాడి జరిగిందని హమాస్ మిలిటెంట్ గ్రూప్ నేత సమీ అబు జుహ్రీ పేర్కొన్నాడు.
ప్రముఖ లెజెండరీ సారంగి ప్లేయర్ పండిట్ రామ్ నారాయణ్ (96) కన్నుమూశారు. శనివారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన మరణాన్ని మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిని ప్రత్యేక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ.పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
గాజాలో కరవు విలయతాండవం చేస్తోంది. ఏడాదికిపైగా గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. ఇప్పటికే ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. భవంతులు కుప్పకూలాయి. ఆహార ఉత్పత్తులు అడుగంటాయి. స్వచ్ఛంద సంస్థల సహాయాలు నిలిచిపోయాయి. దీంతో కరవు మరింత దుర్భిక్షంగా మారింది.
దేశంలో రోజురోజుకు సైబర్ క్రైమ్ పెరిగిపోతుంది. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఎంతో మంది బాధితులు విలవిలలాడారు. అయితే తాజాగా హెచ్ఎస్బీసీ బ్యాంక్ అప్రమత్తం అయింది. తన కస్టమర్లను అప్రమత్తం చేసింది.
హిమాచల్‌ప్రదేశ్ రాజకీయాలను సమోసాల వివాదం ఇంకా కుదిపేస్తోంది. అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల-తూటాలు పేలుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖుకి బీజేపీ ఎమ్మెల్యే 11 సమోసాలను ఆన్లైన్ ఆర్డర్ చేశారు. దీంతో ఈ వివాదం మరింత ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది.
ఇంటెల్ కంపెనీ.. తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఎంప్లాయిస్‌కు ఉచిత పానీయాలు తిరిగి ఇస్తున్నట్లు వెల్లడించింది. ఉద్యోగులను ఉత్సాహపరిచేందుకు ఈ చర్య తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
లోకో పైలట్ నిర్లక్ష్యం కారణంగా ఒక కార్మికుడి ప్రాణం పోయింది. ఈ దారుణ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. లక్నో-బరౌనీ ఎక్స్‌ప్రెస్ (నం: 15204) లక్నో జంక్షన్ నుంచి బీహార్‌లోని బెగుసరాయ్‌లోని బరౌని రైల్వే జంక్షన్లో శనివారం రైలు ఆగింది. ప్లాట్‌ఫాం 5పై ఆగి ఉంది.
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తాజా అధ్యక్ష ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ ఘోరంగా దెబ్బతింది. తొలుత సర్వేలన్నీ కమలా హారిస్ వైపే ఉన్నాయి. కానీ అసలైన ఫలితాలు వచ్చేటప్పటికీ సర్వేలన్నీ తలకిందులయ్యాయి.