భారతదేశంలో ఆధార్ కార్డు ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు అన్నింటికీ ఆధారే ఆధారం అయింది. దేనికైనా ఆధార్ కార్డున అడుగుతున్నారు. దీని బట్టి చెప్పొచ్చు. ఆధార్ కార్డుకు ఎంత విలువ ఉందో. అయితే ఆధార్ గురించి ఇప్పుడెందుకు అంటారా? అయితే ఈ సమాచారం మీకోసమే.
ప్రధాని మోడీ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ సీనియర్ నేత ఎల్కే.అద్వానీ ఇంటికి వెళ్లారు. అద్వానీ శుక్రవారం (నవంబర్ 8) 97వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అద్వానీకి ప్రధాని మోడీ బర్త్‌డే విషెస్ చెప్పారు.
మహారాష్ట్రలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. భారీగా ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆయా సంస్థలకు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 20న సెలవు ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇప్పటికే ఆయా సంస్థలు వేతనంతో కూడిన సెలవును ప్రకటించాయి.
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మహా వికాస్ అఘాడీ కూటమిపై ప్రధాని మోడీ నిప్పులు చెరిగారు. డ్రైవర్ సీటు కోసం మహా వికాస్ అఘాడీ నేతలు కొట్టుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ధూలేలో నిర్వహించిన ప్రచార సభలో మోడీ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదివారం పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో శుక్రవారం సుప్రీం ధర్మాసనం ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. శుక్రవారం ఆయనకు చివరి పని దినం కావడంతో సర్వోన్నత న్యాయస్థానం ఘనంగా వీడ్కోలు తెలిపింది.
నెదర్లాండ్‌లో పాలస్తీనీయులు రెచ్చిపోయారు. ఇజ్రాయెల్ పౌరులపై ఇష్టానురీతిగా దాడులకు తెగబడ్డారు. ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు వెళ్లిన ఇజ్రాయెల్ పౌరులపై ఒక గుంపు మూక దాడికి పాల్పడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
హిమాచల్‌ప్రదేశ్ రాజకీయాలను సమోసాలు, కేక్‌ల వ్యవహారం కుదిపేస్తోంది. అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సమోసా పెట్టిన చిచ్చు.. రాష్ట్ర రాజకీయాలను కంపింపజేస్తోంది.
దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టాలతో ముగిసింది. అంతర్జాయతీయంగా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. ఆ ప్రభావం మన మార్కెట్‌పై కూడా పడింది. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు.. కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి.
దేశంలో రోజురోజుకు మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. నమ్మినవారే నట్టేట ముంచేస్తున్నారు. అన్ని చోట్ల మహిళలకు భద్రత లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో మహిళల సేఫ్టీ కోసం ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు చేసింది.