హైనాన్ ఎయిర్‌లైన్స్‌కు పెనుప్రమాదం తప్పింది. ఆదివారం (నవంబర్ 10) హైనాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం HU438 ఇటలీలోని రోమ్ నుంచి చైనాలోని షెన్‌జెన్‌కు వెళ్తోంది. టేకాఫ్ సమయంలో కుడి ఇంజిన్‌పై పక్షి దాడి చేసింది. దీంతో ఇంజన్ ఫెయిల్యూర్ అయింది. మిడ్-ఎయిర్‌లోకి వెళ్లగానే మంటలు అంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన పైలట్.. తిరిగి రోమ్‌కి తీసుకొచ్చి సేఫ్‌గా ల్యాండ్ చేశాడు. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇది కూడా చదవండి:Deputy CM Pawan Kalyan: జనసేనలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు.. డిప్యూటీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:55 గంటలకు విమానం బయలుదేరింది. ఇటలీలోని రోమ్‌లోని ఫియుమిసినో విమానాశ్రయం నుంచి హైనాన్ ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ అయింది. కొద్దిసేపటికే విమానంలో మంటలు చెలరేగాయి. పైలట్ అప్రమత్తమై వెనక్కి వెళ్లించాడు. చైనాలోని షెన్‌జెన్‌కు బయలుదేరిన విమానాన్ని పక్షి ఢీకొట్టడం వల్లే ఇంజిన్ ఫెయిల్యూర్ అయి ఇబ్బంది తలెత్తింది. విమానం క్షేమంగా ల్యాండ్ అవ్వడంతో 249 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. పక్షి కారణంగానే ఈ ఇబ్బంది తలెత్తిందని ఇటాలియన్ కోస్ట్ గార్డ్ అధికారులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Hainan Airlines right now FCO ✈️ pic.twitter.com/MBmOKgaEuO
— 🅼🅰🆁🅲🅾 © 💭 🐺 (@JOOP99999) November 10, 2024
On November 10th , 2024, Hainan Airlines flight HU438 (Rome-Shenzhen) encountered a bird strike on the right engine during takeoff. In order to ensure safety, the crew promptly returned to the airport according to procedures.
— Hainan Airlines (@HainanAirlines) November 10, 2024