రైతుకు ఎక్కడ కష్టం వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జాతీయ రహదారిపై మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడారు. ‘‘రుణమాఫీ దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా సీఎం రేవంత్ రెడ్డి చేశారు. దేశంలో ఎప్పుడూ కూడా చేయని పని.. ఒక్కసారి ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు రుణమాఫీ చేశాం. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మేము రుణమాఫీ చేశాం. ఇప్పటికే రైతు ఖాతాల్లోకి 32 వేల కోట్లు వేశాం. పంట నష్టపోయిన రైతు ఖాతాలోకి 10 వేల రూపాయలు వెళ్తున్నాయి. 10 వేల రూపాయలు వేయడం కారణంగా రైతుకు మేలు జరగడం లేదు కాబట్టి రైతుకి రైతు పంటకి బీమా మేమే కల్పిస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో మేము చేసినట్లుగా రైతులకు ఏ రాష్ట్రం చేయడం లేదు. రైతులకు ఏ మేలు చేయని వారు రైతుల దగ్గర సానుభూతి పొందేందుకు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు.’’ అని తుమ్మల ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Balagam Venu : ‘ఎల్లమ్మ’ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన దిల్ రాజు
‘‘ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 46 మండలాల్లో 45 మండలాలకు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. పాలేరు నియోజకవర్గానికి అత్యంత కరవు పీడిత ప్రాంతంగా ఉండేది. ఆ ప్రాంతానికి గత ప్రభుత్వంలో నీళ్లు అందించే అవకాశం వచ్చింది. ఇప్పుడు పాలేరుకి కూడా నీళ్లు వచ్చాయి. ఆ విషయంలో నాకు చాలా సంతోషంగా ఉంది. రఘునాథ పాలెం మండలానికి రెండు నదులు ఉన్నా నీళ్లు వచ్చే అవకాశం లేదు. ఖమ్మం ప్రజల దయ వల్ల నేను ఇక్కడకి వచ్చి కూర్చున్నా. హర్యాతండ వాళ్లు మంచి కూరగాయలు పండిస్తున్నారు. రఘునాథ పాలెం మండలానికి కూడా నీళ్లు అందిస్తే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 46 మండలాలకు నీళ్లు ఇచ్చిన సంతృప్తి నాకు ఉంటుంది.’’ అని మంత్రి అన్నారు.
ఇది కూడా చదవండి: Drug Peddlers Arrest: రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ ముఠా గుట్టుర